ఆర్టీసీను గట్టెక్కెంచే బాధ్యత అందరిదీ

20 Nov, 2016 23:03 IST|Sakshi
ఆర్టీసీను గట్టెక్కెంచే బాధ్యత అందరిదీ

– ఆర్టీసీ ఎండీ ఎం మాలకొండయ్య
అనంతపురం న్యూసిటీ : ఆర్టీసీని గట్టెక్కించే బాధ్యత అందరిపై  ఉందని ఆర్టీసీ ఎండీ ఎం మాలకొండయ్య అన్నారు. ఆదివారం ఆయన స్థానిక డిపోను తనిఖీ చేశారు. రీజియన్‌లో సంస్థ పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆక్యుపెన్సీ రేషియో పెంచడంతో పాటు వన్‌మాన్‌ సర్వీసులను తిప్పాలని ఈడీ ఆపరేషన్స్‌ జయరావు డీఎం బాలచంద్రప్పకు సూచించారు. పలు ఎక్స్‌ప్రెస్‌ బస్సులను ఎండీ  పరిశీలించారు. మూలనపడ్డ సీజ్‌ అయిన వాహనానలు చూసి ఎన్ని రోజులుగా ఇక్కడున్నాయని అధికారులను ఆయన  ప్రశ్నించారు.  

రోజుకు రూ 27 లక్షల నష్టం.. ఈడీ
అనంతపురం డిపో రోజుకు రూ 27 లక్షల నష్టం వస్తోందని ఈడీ ఆపరేషన్స్‌ జయరావు అన్నారు. కార్మికులు ప్రతి స్టేజులో ఇద్దరు ప్రయాణికులను ఎక్కించుకుంటే నష్టాల నుంచి గట్టెక్కించవచ్చన్నారు. అక్రమ రవాణాకు ఎస్పీ, ఆర్‌టీఏ అధికారుల సహకారం తీసుకుందామన్నారు. మన సంస్థ కోసం ఓ ఉద్యమంలో కార్మికులందరూ పని చేస్తే మంచి ఫలితాలు సాధిస్తామన్నారు. ఆర్‌ఎం చిట్టిబాబు మాట్లాడుతూ ఎన్ని ఇబ్బందులున్నా  రీజియన్‌లో మరో డిపోను ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు.  తాడిపత్రి డీఎం ఆవుల నరేంద్రరెడ్డి, అసిస్టెంట్‌ మేనేజర్‌ గౌడ్, కంట్రోలర్లు శివలింగప్ప, ఆర్టీసీ వైద్యులు డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు