ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించాలి

17 Dec, 2016 02:03 IST|Sakshi
ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించాలి
భీమవరం టౌ¯ŒS : విచిత్ర జాతిని విద్యావ్యవస్థ సృష్టిస్తుంటే విద్యార్థి సంఘాలు చూçస్తూ ఊరుకోవంటూ  హా¯Œ్స ఇండియా చీఫ్‌ ఎ డిటర్, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌ అన్నారు. భీమవరం ఏఎస్‌ఆర్‌ సాంస్కృతిక కేంద్రంలో జరుగుతున్న ఎస్‌ఎఫ్‌ఐ 21వ మహాసభల్లో భాగంగా శుక్రవారం ముఖ్య అతిథిగా నాగేశ్వర్‌ మాట్లాడారు. విద్యాసంస్థలు సమాజం గురించి ఆలోచించే మెదళ్లను తయారు చేయలేనప్పుడు విద్యార్థి సంఘాలు ఆ బాధ్యతను తీసుకోవాలన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు విద్యారంగంలో వెనుకబడ్డాయన్నారు. బలమైన ప్రజా ఉద్యమా లు, సామాజికాభివృద్ధి ద్వారానే విద్యారంగం ప్రగతి సాధిస్తుందని చెప్పారు. నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను అందుబాటులోకి తెచ్చే ప్రతి చర్యనూ సమర్థిస్తామని, ఇందుకు విరుద్ధమైన ప్రతి చర్యనూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చా రు. పాలకులు విద్యాహక్కు చట్టాన్ని కూ డా నీరుగార్చుతున్నారని ఆందోళన వ్యక్త ం చేశారు. ప్రైవేట్‌ వర్సిటీల ఏర్పాటు విద్యావ్యాప్తికి దోహదపడదన్నారు. 
దాడులను ప్రశ్నించకూడదా..!
సింగపూర్, చైనా, జపాన్, అమెరికాలను చూసి నేర్చుకోవాలని చెబుతున్న ముఖ్యమంత్రి నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది చాలా ఉందని నాగేశ్వర్‌ అన్నారు. యూనివర్సిటీలు ఎలా ఉన్నాయనడానికి వేముల రోహిత్, కన్హయ్య సంఘటనలు అద్దం పడుతున్నాయన్నారు. దాడులను విద్యార్థులు ప్రశ్నించకూడదనే భావనలో పాలకులు ఉన్నారని విమర్శించారు. దేశవ్యాప్తంగా బ్యాంకుల ముందు జనం బారులు తీరి ఉంటుండగా ఈ విషయంపై ఉస్మానియా వర్సిటీలో ఒక్క సదస్సు కూడా ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. విద్యావిధానంలో, విద్యా సమాజంలో మార్పునకు విద్యార్థి సంఘాలు నిరంతర కృషి చేయాలని పిలుపునిచ్చారు. మేధావులను తయారు చేసే కేంద్రంగా విశ్వవిద్యాలయాలు ఉండాలని ఆకాంక్షించారు. 
పేదలకు ఉన్నత విద్య దూరం
ఎమ్మెల్సీ రాము సూర్యారావు మాట్లాడుతూ ఉన్నత విద్యను పేద విద్యార్థులకు దూరం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయాలు మ తోన్మాదులకు నిలయాలుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 
ఎస్‌ఎఫ్‌ఐ పోరాటాలు
ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షుడు వీపీ సాను మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విద్యా రంగాన్ని నిర్వీర్యం చేస్తోందన్నారు. ఆం ధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలు మూతపడుతున్నాయని చెప్పారు. విద్యారంగ పరిరక్షణకు ఎస్‌ఎఫ్‌ఐ పోరాటాలు చేస్తోందని తెలిపారు. 
ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి విక్రమ్‌సింగ్, జాతీయ మాజీ అధ్యక్షుడు వై.వెంకటేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్షుడు వై.రాము, ఉపాధ్యక్షుడు పి.రవికుమార్, మంతెన సీతారాం, కె.హరికిశోర్, బి.సాంబశివ, పి.తులసి, ఎల్‌.చిన్నారి, కె.మహేష్, రాజు, పి.కిరణ్, ఎంవీ రమ ణ, ఎ.అశోక్, కె.ఆంజనేయులు, కె.క్రాం తి తదితరులు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు