పాఠశాలలను సిద్ధం చేయాలి

19 May, 2017 23:26 IST|Sakshi
పాఠశాలలను సిద్ధం చేయాలి
తాడేపల్లిగూడెం (తాలూకా ఆఫీస్‌ సెంటర్‌): పాఠశాలల పునఃప్రారంభం కల్లా పాఠశాలలను అన్ని విధాలుగా సిద్ధం చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి గంగా భవాని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక మాంటిస్సోరీ పాఠశాలలో డివిజన్‌ స్థాయి ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. హెచ్‌ఎంలను ఉద్దేశించి డీఈఓ మాట్లాడుతూ పదో తరగతిలో ఫైయిలైన విద్యార్థులకు ఆయా సబ్జెక్ట్స్‌ ఉపాధ్యాయులతో రోజూ 2 గంటల సేపు ప్రత్యేక బోధన చేయించాలని ఆదేశించారు. ప్రతి పాఠశాలలో తరగతి గదుల పరిశుభ్రత, టాయ్‌లెట్స్‌ సక్రమ నిర్వహణ, తాగునీరు, కిచెన్‌ గార్డెన్‌ బాధ్యతను హెచ్‌ఎంలు తీసుకోవాలని సూచించారు. డిజిటల్‌ తరగతులను రోజుకు 4 గంటలకు తగ్గకుండా నిర్వహించాలన్నారు. డిజిటల్‌ గదులు లేని పాఠశాలల ప్రదానోపాధ్యాయులు  గ్రామాలలోని దాతల సహకారంతో రూ.45 వేలు విరాళంగా సేకరిస్తే ముగిలిన సొమ్మును ప్రభుత్వ నిధులలో కేటాయించి డిజిటల్‌ క్లాస్‌ రూంలు ఏర్పాటు చేస్తామన్నారు. కాల నిర్ణయ పట్టికలో సబ్జెక్టు బోధనలతో పాటుగా నీటి విద్య, వ్యాయా విద్య, జీవన నైపుణ్యాలు, ఒకేషనల్‌ విద్యకు స్థానం కల్పించాలని డీఈఓ ఆదేశించారు. కార్యక్రమంలో ఎంఈఓలు హనుమ, శేషు, శ్రీనివాస్, వంగపండు నరసింహమూర్తి, పాపారావు, విలియమ్స్, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు