ఎస్‌ఐ నుంచి రక్షణ కల్పించాలి బాధితుడి వేడుకోలు

7 Sep, 2016 00:03 IST|Sakshi
 
జగ్గయ్యపేట అర్బన్‌ : 
అన్నదమ్ముల వివాదంలో ఎస్‌ఐ పి.శ్రీను బెదిరింపులకు పాల్పడుతున్నడని పట్టణానికి చెందిన అప్పారి వెంకటేశ్వరరావు ఆరోపించాడు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ అన్నదమ్ముల ఘర్షణ విషయంలో పట్టణ ఎస్‌ఐ తనను విచక్షణ రహితంగా దాడి చేయగా న్యాయస్థానంలో ఫిర్యాదు చేసినట్లు వివరించాడు. జడ్జి ఆదేశం మేరకు ఎస్‌ఐ పి.శ్రీనుపై కేసు నమోదు అయినట్లు చెప్పారు. ఆ కేసును పోలీసులంతా కలిసి నీరుగార్చారని పేర్కొన్నాడు. ఎస్‌ఐపై కేసు నమోదైనప్పటి నుంచి ఎస్‌ఐతో పాటు ఆయన మద్దతుదారులు అనేకసార్లు వచ్చి రాజీపడాలని, లేకపోతే చంపుతామని, సంతకాలు చేయాలని బెదిరిస్తున్నారని వాపోయాడు. ఈ నెల 2 వ తేదీ తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేట సమీపంలోని పరివిరి గ్రామంలో ఉన్న మా అమ్మ సూర్యకాంతం(72) వద్దకు కానిస్టేబుల్‌ దాసు వెళ్లి ఎస్‌ఐ పంపాడు సంతకాలు పెట్టాలని బెదిరించినట్లు తెలిపాడు. పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు.
 
మరిన్ని వార్తలు