నాలుగు సిలికా లారీలు పట్టివేత

13 Aug, 2016 00:33 IST|Sakshi
 
చిల్లకూరు : నిబంధనలకు విరుద్ధంగా సిలికాను తరలిస్తున్న నాలుగులారీలను శుక్రవారం సాయంత్రం విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. వివరాలు.. తీరప్రాంత గ్రామాల్లోని గనుల నుంచి అధికలోడుతో పాటు సరైన ధ్రువీకరణపత్రాలు సిలికాను తర లిస్తున్న నాలుగు లారీలను విజిలెన్స్‌ డీఎస్పీ వెంకట్‌నాథ్‌రెడ్డి, సీఐ సత్యనారాయణ, ఏజీ రాములు పట్టుకున్నారు. వాటిలో ఒక లారీని రవాణాశాఖాధికారులకు అప్పగించారు. మరోలారీ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేదిగా తెలిసింది. లారీని పట్టుకున్నట్లు తన సిబ్బంది ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో అధికారులు దానికి ఎలాంటి జరిమానా విధించలేదని సమాచారం. మరో రెండు లారీలను మాత్రం చిల్లకూరు పోలీసులకు అప్పగించి గనులశాఖకు సిపార్సు చేశారు. ఎమ్మెల్యే లారీ వ్యవహారంపై విజిలెన్స్‌ అధికారులను వివరణ కోరేందకు ప్రయత్నించగా వారు అందుబాటుకి రాలేదు.   
మరిన్ని వార్తలు