తిరుమలలో ఆరడుగుల నాగుపాము

28 Jun, 2016 18:10 IST|Sakshi
తిరుమలలో ఆరడుగుల నాగుపాము

తిరుమలలో వన్యప్రాణుల బెడత పెరిగింది. ఒకవైపు చిరుతల సంచారంతో భక్తులు ఆందోళన పడుతోంటే.. మరో వైపు.. నాగు పాములు, కొండ చిలువలు.. జనావాసాల్లోకి వచ్చి కలకలం రేపుతున్నాయి. తాజాగా మంగళవారం ఆరు అడుగుల నాగుపాము అటవీశివారు ప్రాంతం నుండి బాలాజీనగర్ చివరి సంధు వద్ద రోడ్డుపైకి వచ్చింది. స్థానికులు పామును చూసి పరుగులు తీసారు. సమాచారం అందుకున్న  టీటీడీ ఫారెస్ట్ మజ్దూర్ భాస్కర్‌నాయుడు సంఘటనా స్థలానికి వచ్చి పామును పట్టుకున్నాడు. దీంతో జనం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత నాగుపామును అటవీ ప్రాంతంలో వదిలి వేశారు.

 

మరిన్ని వార్తలు