ముగిసిన సాధికార సర్వే!

11 Jan, 2017 00:10 IST|Sakshi
–అడ్రస్‌లు లభించనివారు 93,666 మంది
–వీరి కోసం తహసీల్దారు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక కేంద్రాలు
కర్నూలు(అగ్రికల్చర్‌): దాదాపు 7 నెలల పాటు సుదీర్ఘంగా సాగిన ప్రజాసాధికార సర్వేకు ఎట్టకేలకు మంగళవారంతో ముగింపు పలికారు.   గత ఏడాది జూలై నెలలో సర్వే మొదలైంది. జిల్లాలో 11,60,220 ఇళ్లు ఉండగా 10,75,145 ఇళ్లను సర్వే చేశారు. 85,075 ఇళ్ల అడ్రస్‌లు లభించలేదు. ఈ సర్వే ప్రకారం జిల్లాలో 39,98,336 మంది ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇందులో 35,81,235 మందిని సర్వే పరిధిలోకి తెచ్చారు. మిగిలిన 4,17,101 మందిని వివిద కారణాలతో సర్వే చేయలేకపోయారు. ఇందులో 93,666 మందిని ఎన్యూమరేటర్లు గుర్తించలేకపోయారు. గుర్తించలేకపోయిన వారిలో పట్టణ ప్రాంతాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. కర్నూలు మున్సిపల్‌ కార్పొరేషన్‌తో సహా జిల్లాలో పట్టణ ప్రాంతాలు 9 ఉన్నాయి. వీటిల్లోనే 84,132 మందిని గుర్తించలేదు. అత్యధికంగా నంద్యాల మున్సిపాలిటీలో 55,961 మంది అడ్రస్‌లను కనుగొనడంలో సర్వే సిబ్బంది విఫలమయ్యారు. కర్నూలు నగరపాలలక సంస్థలో 12,151 మంది వివరాలను తెలుసుకోలేకపోయారు. గ్రామీణ ప్రాంతాల్లో 9,534 మంది అడ్రస్‌లను గుర్తించలేదు. సర్వే చేయని 93,336 మంది కోసం తహసీల్దారు కార్యాలయాలు, మున్సిపల్‌ కమిషనర్ల కార్యాలయాల్లో ఒక ప్రత్యేక సెంటరు ఏర్పాటు చేసి సర్వేకు అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు మీ సేవా కేంద్రాల పరిపాలనా అధికారిణి వెంకటలక్ష్మి తెలిపారు.
 
సర్వేసిబ్బందికి టీఏ, డీఏలు విడుదల
 ప్రజాసాధికార సర్వే పూర్తి కావడంతో ఎన్యూమరేటర్లు, వారి అసిస్టెంట్లకు టీఏ, డీఏలు ఇవ్వడానికి ప్రభుత్వం రూ.2కోట్లు విడుదల చేసింది. సర్వే పూర్తి అయినట్లుగా ఎన్యూమరేటర్లు చార్జీ ఆఫీసర్లకు సర్టిఫికెట్‌లు ఇస్తే టీఏ, డీఏ పంపిణీ చేస్తారని  మీ సేవా కేంద్రాల పరిపాలనా అధికారిణి తెలిపారు.
 
 
ప్రజాసాధికార సర్వే వివరాలు ఇలా ఉన్నాయి...
జిల్లా జనాభా 39,98,336
సర్వే చేసింది 35,81,235
సర్వేలో లేని వారు 4,17,101
మరణించిన వారు 30348
వలసవెళ్లిన వారు 2,05,036
వివాహాలు చేసుకుని వెళి​‍్లన వారు 35,299
సర్వేపై అసక్తి చూపని వారు 5937
డోర్‌లాక్ 22730
ఆధార్‌ నంబర్లు లభించని వారు. 11907
సాంకేతిక సమస్యలు 12178
అడ్రస్‌లు లభించని వారు 93,666
పట్టణ ప్రాంతాల్లో అడ్రస్‌లు లభించనివారు 84,132
గ్రామీణ ప్రాంతాల్లో గుర్తించనివారు       9534
 
>
మరిన్ని వార్తలు