పాముకాటుకు చిన్నారి బలి

27 Aug, 2016 00:42 IST|Sakshi
  • ఝాన్సీనగర్, లక్నెపల్లిలో విషాద ఛాయలు 
  • మామునూరు : బతుకుదెరువు కోసం వచ్చిన ఆ దంపతులకు పాము కాటు కడుపుకోతను మిగిల్చింది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న వారి కూతురు పాము కాటుతో అనంతలోకాలకు చేరింది. ఈ సంఘటన హన్మకొండ మం డలం తిమ్మాపురం గ్రామంలోని ఝాన్సీనగర్‌లో గురువారంరాత్రి జరిగింది.మామునూరు పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. నర్సంపేట మండలానికి చెందిన లక్నెపల్లి గ్రామానికి చెందిన భాషబోయిన రాజు, కళ్యాణి దంపతులు కూలి చేస్తు జీవనం సాగిస్తున్నారు.
     
    వారికి ఒక్కగానొక్క కూతురు హర్షిత(5) ఉంది. బతుకుదెరువు కోసం వారు నాలుగేళ్ల క్రితం హన్మకొండ మండలం తిమ్మాపురంలోని ఝాన్సీనగర్‌ కాలనీకి వలస వచ్చారు. ఇక్కడ ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. రాజు ప్లంబర్‌ పని చేస్తుండగా, కళ్యాణి వ్యవసాయ కూలి పనులకు వెళుతోంది. గత ఏడాది నుంచి పింఛన్‌పురంలోని ప్రజ్ఞ ప్లే వేlస్కూల్‌లో హర్షిత ఎల్‌కేజీ చదువుతోంది. గురువారం రాత్రి నిద్రిస్తున్న హర్షిత చేతి వేళ్లపై అర్ధరాత్రి 12 గంటల తర్వాత కట్ల పాము కాటేసింది.
     
    అరగంట తర్వాత పాప మెలికలు తిరుగుతూ నోటి నుంచి నురుగలు కక్కడంతో గమనించిన తల్లిదండ్రులు వెంటనే లైట్‌ వేసి కాళ్లు, చేతులు పరీక్షించారు. చేతి వేళ్లకు రెండు కాట్లు పడి రక్తస్రావం కావడం కనిపించింది. వెంటనే ఇంట్లో Ðð తకగా పప్పు డబ్బాల పక్కన  కట్లపాము కని పించింది. పక్కింటి వారి సాయంతో పామును చంపి, చిన్నారిని వెంటనే ఎంజీఎం అస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శుక్రవారం ఉద యం మృతిచెందింది. హర్షితపైపడి తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. రాజు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై యుగేందర్‌ తెలిపా రు.   బాలిక చదువుతున్న ప్రజ్ఞ ప్లే వే స్కూల్‌  పాఠశాలను బంద్‌ చేయించారు. కర స్పాండెం ట్‌ ఎల్లయ్య, ఉపాధ్యాయులు విద్యా ర్థినికి నివాళులర్పిస్తూ సంతాపం తెలిపారు. స్థానిక కార్పొరేటర్‌ చింతల యాదగిరి,  నాయకులు పోశాల సదానందం, మేకల సూరయ్య, బుస్స వెంకటేశ్వర్లు, ముప్ప నర్సయ్య, జోగిరెడ్డి, షకీల్,  బాలిక తల్లిదండ్రులను పరామర్శించారు. 
    వనపర్తిలో మరొకరు..
    వనపర్తి(లింగాలఘణపురం) : మండలంలోని వనపర్తికి చెందిన మేకల వెంకటలక్ష్మి(55) శుక్రవారం పాముకాటుతో మృతచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. వెంకటలక్ష్మి ఇంట్లో నిద్రిస్తుండగా ఆమెను పాము కాటు వేసింది. శుక్రవారం తెల్లవారుజామున గమనించి జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో హైదరాబాద్‌ తీసుకెళుతుండగా మార్గమధ్యలో ఆలేరు వద్ద మృతి చెందింది. మృతురాలికి భర్త, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.  
>
మరిన్ని వార్తలు