వైభవంగా బలరామ జయంతి

19 Aug, 2016 00:31 IST|Sakshi
వైభవంగా బలరామ జయంతి
నెల్లూరు(బృందావనం):  నగరంలోని ఇస్కాన్‌సిటీలోని ఇస్కాన్‌ మందిరంలో గురువారం బలరామ జయంతిని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశేష పూజలు, అభిషేకాలు, ఊంజల్‌ సేవ నిర్వహించారు. భక్తులు సంకీర్తనలను అలపించారు. ఈ సందర్భంగా ఇస్కాన్‌  నెల్లూరు మందిరం అధ్యక్షుడు సుఖదేవ్‌స్వామి దైవసందేశాన్ని అందించారు. బలరాముడిని పూజించడం ద్వారా పొందే ఆధ్యాత్మిక శక్తి,అనుగ్రహంతో జీవితాన్ని సుఖసంతోషాలతో గడపగలమని పేర్కొన్నారు. 
>
మరిన్ని వార్తలు