శ్రీపాద గృహాన్ని స్మృతిచిహ్నంగా ప్రకటించాలి

20 Oct, 2016 22:30 IST|Sakshi
  • శ్రీపాద మునిమనుమడు కల్లూరి శ్రీరామ్‌
  • రాజమహేంద్రవరం కల్చరల్‌ : 
    ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర తొలి ఆస్థానకవి, మహామహోపాధ్యాయ బిరుదాంకితుడు శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి నివసించిన సుదర్శన భవనాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, ఆ మహానుభావుని స్మృతి చిహ్నంగా ప్రకటించాలని శ్రీపాద కుమార్తె మనుమడు కల్లూరి శ్రీరామ్‌ కోరారు. విశాఖలోని హిందుస్థా¯ŒS షిప్‌యార్డులో ఛీప్‌ మేనేజర్‌గా ఉద్యోగ విరమణ చేసిన ఆయన శ్రీపాద సార్ధశతజయంతి ఉత్స వం (శుక్రవారం) నిర్వహించడానికి రాజమహేంద్రవరం వచ్చారు. ఈ నేపథ్యంలో గురువారం ‘సాక్షి’తో మాట్లాడారు. 
    ∙‘భారత, భాగవత, రామాయణాలను ఒంటిచేత్తో రచించిన కవి తెలుగు సాహిత్య ప్రపంచంలో శ్రీపాద తప్ప మరొకరు కనపడరు. వ్యాస భారతం, ద్రోణపర్వంలో అభిమన్యుని వధ ఘట్టాన్ని అనువదిస్తున్న సమయంలో పది వసంతాల ఆయన కుమారుడు సుదర్శన సుధి అకాలమరణం చెందారు. కుమారుడి జ్ఞాపకార్థం తన ఇంటికి సుదర్శన భవనం అని పేరుపెట్టుకున్నారు. 
    ∙విజయనగరంలో గురజాడ భవనం, విజయవాడలో విశ్వనాథ సత్యనారాయణ నివాసం, రాజమహేంద్రవరంలో శ్రీపాద కృ ష్ణమూర్తి శాస్త్రి భవనాలను సేకరించి ఆ మహనీయుల స్మృతిచిహ్నాలుగా ప్రకటించాలి. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆవరణలో 1941లో శ్రీపాద జీవించి ఉన్న సమయంలోనే ఆయన విగ్రహం నెలకొల్పారు. ఆ కార్యక్రమానికి శ్రీపాద  స్వయంగా హాజరయ్యారు. దాన్ని మరో ప్రాంతానికి తరలిస్తే కూలిపోయే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు.
    ∙శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి నివసించిన వీధికి (నేటి మెయి¯ŒSరోడ్డు) ఆయన పేరు పెట్టడం సముచితంగా ఉంటుంది. శ్రీపాద 200కి పైగా గ్రంథాలు రచించ గా.. నేడు వంద లోపే లభ్యమవుతున్నాయి. ఆయన రచించిన అన్ని గ్రంథాలనూ సేకరించాలి. కేంద్ర సాహిత్య అకాడమీ ’శ్రీకృష్ణ స్వీయచరిత్ర’ (శ్రీపాద  కృష్ణమూర్తి శాస్త్రి స్వీయచరిత్ర) గ్రంథాన్ని ముద్రించాలి.
    ∙శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రికి వివిధ సభలలో బహూకరించిన సువర్ణగండ పెండేరం, రాష్ట్రపతి, ఇతర ప్రముఖులు ఇచ్చిన సత్కార ప్రమాణ పత్రాలు, కళ్లజోడు వంటి వ్యక్తిగత వస్తువులను శ్రీపాద కోరిక మేరకు, ఆయన దౌహిత్రుడు, నా తండ్రిగారు కల్లూరి çసత్యనారాయణమూర్తి ఆంధ్రవిశ్వవిద్యాలయానికి 1965లో బహూకరించారు. ఆ వస్తువులను అక్కడ అనునిత్యం ప్రదర్శించకపోవడంతో, కొన్ని విలువైన వస్తువులను మా నాన్నగారి కృషితో విశాఖ మ్యూజియానికి తరలించా రు. అక్కడ ఆ వస్తువులు పదిలంగాఉన్నాయి.వాటిని నిత్యం ప్రదర్శించడానికి చర్యలు తీసుకోవాలి. 
     
మరిన్ని వార్తలు