ఎస్సారెస్పీ జలాలు వృథా చేయొద్దు

2 Oct, 2016 00:51 IST|Sakshi
ఎస్సారెస్పీ జలాలు వృథా చేయొద్దు
 
  • నిండని చెరువులకు మళ్లిస్తే మరో రెండేళ్లు కరువు ఉండదు  
  • మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు
 
తొర్రూరు : మెట్ట ప్రాంతమైన వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో వర్షాలతో నిండని చెరువులను ఎస్సారెస్పీ జలాల ద్వారా నింపుకుంటే మరో రెండేళ్ల వరకు కరువు లేకుండా ఉంటుందని రోడ్డు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. శనివారం తొర్రూరు మండల కేంద్ర శివారులోని ఎర్రసోమ్లా తండ వద్దనున్న ఎస్సారెస్పీ ఫేస్‌–2 కాల్వ వద్ద స్థానిక ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలసి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ గత నెలరోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతుండడంతో ప్రాజెక్ట్‌లన్ని వరద నీటితో నిండి వృథాగా సముద్రంలో కలసిపోతున్నాయన్నారు.
 
అం దుకే సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావుతో మాట్లాడి నిండని చెరువులు, కుంటలను ఎస్సారెస్పీ జలాలతో నింపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రజాప్రతి నిధులు, సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉంటూ వరదనీరు, ఎస్సారెస్పీ నీరు వృథా కాకుండా చూసుకోవాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గంలోని అన్ని చెరువులు, కుంటలను నింపేందుకు ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతూ కృషి చేస్తున్నట్లు పేర్కోన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సోమయ్య, జడ్‌పీటీసీ కమలాకర్, టీఆర్‌ఎస్‌ నాయకులు నెహ్రునాయక్, వెంకటనారాయణగౌడ్, డాక్టర్‌ సోమేశ్వర్‌రావు, సోమనర్సింహరెడ్డి, నరేందర్‌రెడ్డి, ఈదురు ఐలయ్య, రాజేష్‌నాయక్, శంకర్, కొమురయ్య, ఈనెపెల్లి శ్రీను, నట్వర్, రామిని శ్రీను, సీతారాములు, కుమార్, శ్రీనివాస్, వెంకన్న, కిష¯ŒSయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.  
మరిన్ని వార్తలు