రాష్ట్రస్థాయి చెస్‌ పోటీలకు ‘విక్టరీ’ విద్యార్థులు

25 Jul, 2016 21:39 IST|Sakshi
రాష్ట్రస్థాయి చెస్‌ పోటీలకు ‘విక్టరీ’ విద్యార్థులు
అమలాపురం :
జిల్లా చెస్‌ అసోసియేషన్‌ నిర్వహించిన అండర్‌–19 చదరంగం పోటీల్లో భట్లపాలెం బీవీసీ ఇంజనీరింగ్‌ కాలేజీ విద్యార్థి, చెస్‌లో తమ వద్ద శిక్షణ పొందిన చైతన్యసాయిరాం చాంపియన్‌ షిప్‌ను కైవసం చేసుకున్నాడని విక్టరీ అకాడమీ ప్రిన్సిపాల్‌ టి.వి.సురేష్‌ కుమార్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. చైతన్యసాయిరాం రాష్ట్ర స్థాయి జూనియర్‌ చాంపియన్‌ షిప్‌ పోటీలకు ఎంపికైనట్టు వివరించారు. రాజమహేంద్రవరం అల్యూమినియం అసోసియేషన్‌ హాల్లో శనివారం జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో నలుగురు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కాగా, అందులో తమ అకాడమీకి చెందిన ముగ్గురు ఉన్నారని తెలిపారు. తమ అకాడమీ విద్యార్థుల్లో చైతన్యతోపాటు రవీంద్రభారతి పాఠశాల విద్యార్థి ఎస్‌.సాయిహృషికేష్‌ రెండవస్థానం, నాథ్‌ విద్యానికేతన్‌ విద్యార్థి గోకరకొండ అజయ్‌ మూడవస్థానం సాధించారన్నారు. వీరంతా వచ్చేనెల 12న విజయనగరంలో జరిగే ఆంధ్రప్రదేశ్‌ జూనియర్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు.

 

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు