విద్యార్థులు జాస్తీ.. వసతి నాస్తి

2 Sep, 2016 22:50 IST|Sakshi
విద్యార్థులు జాస్తీ.. వసతి నాస్తి

– జేఎన్‌టీయూలో హాస్టల్‌ సదుపాయం లేక ఇక్కట్లు
– అమ్మాయిలకు రెండు హాస్టల్స్‌ పరిమితం
– ఓటీఆర్‌ఐలో ఫార్మసీ విద్యార్థులకు హాస్టల్‌ లేని వైనం


జేఎన్‌టీయూ : వర్సిటీ క్యాంపస్‌లో  హాస్టల్‌ కొరత,  తగిన ∙మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు ఇక్కట్లుకు గురవుతున్నారు. ఎంటెక్‌ కోర్సుల్లో అడ్మిషన్‌ పొందే విద్యార్థులు సగం మందికి వసతి లేక వారు దిక్కుతోచని స్థితి ఉన్నారు. ఉన్న వాటిలో సామర్థ్యానికి మించి విద్యార్థులకు కేటాయించడంతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి.

భోజనం ఇక్కడ .. వసతి బయట:
జేఎన్‌టీయూ అనంతపురం క్యాంపస్‌ కళాశాలలో ఆరు బ్రాంచుల్లో నాలుగు సంవత్సరాల విద్యార్థులు కలిపి 1440 మంది  చదువుతున్నారు. వీరికి హాస్టల్‌ సదుపాయం ఉంది. కానీ ఎంటెక్‌  22 బ్రాంచుల్లో 697 మంది  అభ్యసిస్తున్నారు. వీరిలో 400 మంది విద్యార్థులకు హాస్టల్‌ కొరత ఉంది. హాస్టల్‌లో అడ్మిషన్‌ పొందిన విద్యార్థికి ప్రభుత్వం నుంచి స్కాలర్‌షిప్‌ అందుతుంది. దీంతో ఈ 400 మంది విద్యార్థులకు హాస్టల్‌లో భోజనం  అందుబాటులో తెచ్చారు. కానీ వసతిలేక బయట ఉండాల్సిన దుస్థితి . బయట అద్దె అధికంగా ఉండటంతో ప్రభుత్వం నుంచి అందుతున్న స్కాలర్‌షిప్‌ ఏ మాత్రం సరిపోవడం లేదని విద్యార్థులు వాపోతున్నారు.

ఓటీపీఆర్‌ఐలో హాస్టళ్లు లేవు..
ఆయిల్‌ టెక్నాలజీ రీసెర్చ్, ఫార్మసీ ఇనిస్టిట్యూట్‌ జేఎన్‌టీయూ అనంతపురంలో ఫుడ్‌ టెక్నాలజీ, ఫార్మసీ కోర్సులు నిర్వహిస్తున్నారు. ఎంటెక్‌ సుటిక్స్, కెమిస్ట్రీలో ఒక్క అడ్మిషన్‌ కూడా  కాలేదు.  నాలుగు బ్రాంచులకు కలిపి కేవలం 14 ఎంఫార్మసీ సీట్లు భర్తీ కావడానికి కారణం హాస్టల్‌ వసతి లేకపోవడమేనని తెలుస్తోంది.
–––––––––––––––––––––––––
హాస్టళ్లు పెంచాలని ప్రతిపాదన పంపాం
ఎంటెక్‌ విద్యార్థులకు హాస్టల్‌ సంఖ్య పెంచాలని  ఉన్నతాధికారులకు ప్రతిపాదన పంపాం. లేపాక్షి పక్కన మరో నూతన భవనం నిర్మాణం చేపట్టాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. హాస్టల్‌ కొరత తీర్చడానికి ప్రత్యేక చర్యలు తీసుకోనున్నాం.
–డాక్టర్‌ శివకుమార్, హాస్టల్‌ మేనేజర్‌.

మరిన్ని వార్తలు