బీసీ హాస్టళ్ల పునరుద్ధరణ కోసం ఆందోళన

27 Jul, 2016 12:36 IST|Sakshi
బీసీ హాస్టళ్ల పునరుద్ధరణ కోసం ఆందోళన
గాలివీడు: వైఎస్సార్ జిల్లా గాలివీడు, చిన్నమండ్యంలలో ఎత్తివేసిన బీసీ హాస్టళ్లను పునరుద్ధరించాలని కోరుతూ రాయచోటిలో విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. రాయచోటి తహశీల్దార్ కార్యాలయం వరకు విద్యార్థులు ర్యాలీ తీశారు. అనంతరం కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఆందోళనకు దిగిన విద్యార్థులకు ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మద్ధతు తెలిపారు. విద్యార్ధుల సమస్యలపై పభుత్వంతో పోరాడతామని హామీ ఇచ్చారు.
మరిన్ని వార్తలు