ఓసీ కోసం ఇంటింటి సర్వే ప్రారంభం

19 Jul, 2016 23:34 IST|Sakshi
కాసిపేట : మండలంలోని దుబ్బగూడెంలో మంగళవారం ఉదయం నుంచి రెవెన్యూ, సింగరేణి అధికారులు కెకె ఓపెన్‌కాస్టు ప్రాజెక్టుకు సంబంధించి గహాల సర్వేలు ప్రారంభించారు. ఈసందర్భంగా ఇంటింటికి వెళ్లి సర్వేలు చేశారు.
ఇంటి విస్తీర్ణం మాత్రమే సర్వేచేయడం జరుగుతుందని తెలిపారు. ఈసర్వేల అనంతరం ఇంజనీరింగ్‌ అధికారులు ఇంటివిలువ, ఇతర నిర్మాణాలు, చెట్లు తదితర అంశాలపై సర్వేచేసి పూర్తివిలువ నిర్ధారించనున్నట్లు తెలిపారు. సర్వేలో ఏంఆర్‌ఐ కమల్‌సింగ్, బెల్లంపల్లి, నెన్నెల సర్వేయర్లు అలోవ్‌సింగ్, మణిరాజ్, సింగరేణి సర్వేయర్లు, సిబ్బంది తదితరులున్నారు.
సర్వేను అడ్డుకున్న ఓసీ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు
కెకె ఓపెన్‌కాస్టు కోసం దుబ్బగూడెంలో చేస్తున్న ఇళ్ల సర్వేను సాయంత్రం ఓసీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో అడ్డుకున్నారు. ప్రభుత్వం ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. ప్రజల ఇష్టం పక్కన పెడితే వారికి చెల్లించే పరిహారంపై ఆమోదం లేకుండానే సర్వేలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఓసీ వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్‌ గాదేవేణి బుచ్చయ్య, కోకన్వీనర్‌ బోగె పోశం, నాయకులు గోనెల శ్రీనివాస్‌ తదితరులున్నారు.
 
మరిన్ని వార్తలు