కుంగ్‌ఫూ, కరాటేలో జిల్లా ప్రతిభ

30 Jan, 2017 23:39 IST|Sakshi
 
  గుంటూరు స్పోర్ట్స్: విజయవాడలో ఈనెల 29వ తేదీన నిస్‌కిన్‌ మంక్‌ కుంగ్‌ఫూ అకాడమి ఆ«ధ్వర్యంలో జరిగిన రాష్టస్థాయి కుంగ్‌ఫూ, కరాటే పోటీలలో తమ క్రీడాకారులు అత్యంత ప్రతిభ కనబర్చి రెండు బంగారు, ఒక రజత, నాలుగు కాంస్య పతకాలు సాధించారని ఉషూ కుంగ్‌ ఫూ అకాడమి చీఫ్‌ ఇన్‌స్ట్రక్టర్‌ షేక్‌ సంధాని తెలిపారు. పతకాలు సాధించిన క్రీడాకారులను సోమవారం బ్రాడీపేట మహిమ గార్డెన్స్‌లోని అకాడమిలో ఆయన అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అండర్‌–12 స్పారింగ్‌ విభాగంలో ఎం.థామస్‌ బంగారు, ఎం.తరుణ్య కాంస్య పతకాలు సాధించారని తెలిపారు. 50 నుంచి 65 కేజీల స్పారింగ్‌ విభాగంలో కె.సాయిమౌళి బంగారు, ఎ.శేషసాయి కిరణ్‌ రజత, ఎస్‌.సాయి శాండిల్య, ప్రవీణ్‌ ఫ్రాన్సిస్, పీఎన్‌ఎస్‌ తేజస్వి కాంస్య పతకాలు సాధించారని చెప్పారు. భవిష్యత్తులో జాతీయ స్థాయిలో పతకాలు సాధించేలా   తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో క్రీడాకారులు, శిక్షకులు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు