అధికార దాహంతోనే పార్టీ ఫిరాయిస్తున్నారు

3 Dec, 2016 02:32 IST|Sakshi
అధికార దాహంతోనే పార్టీ ఫిరాయిస్తున్నారు

వైఎస్సార్ సీపీ రాష్ట్ర హైపవర్ కమిటీ సభ్యులు తమ్మినేని సీతారాం   
 
ఆమదాలవలస/రూరల్: స్వార్థ రాజకీయాలు, అధికార దాహం, సంపాదనే ధ్యేయంగా కొందరు పార్టీ ఫిరారుుస్తున్నారని, వారికి దమ్ముంటే పదవులకు రాజీనామా చేసి ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర హైపవర్ కమిటీ సభ్యు లు తమ్మినేని సీతారాం సవాల్ విసిరారు. పట్టణంలో ఆయన నివాసగృహంలో శుక్రవారం ఆ యన విలేకరులతో మాట్లాడారు. పార్టీ సింబల్ తో గెలిచిన ఎంపీటీసీ, సర్పంచ్, కౌన్సిలర్స్, జెడ్పీటీసీ వంటి వారు పార్టీ ఫిరారుుంపులు చేయడం పార్టీ ఫిరారుుంపుల చ ట్టం పరిధిలోకి వస్తుందని అన్నారు. ఏ పార్టీ ద్వారా అరుునా ఎన్నికై న ప్రజాప్రతినిధి  పార్టీ మారాలంటే ఏ పార్టీ సింబ ల్‌తో ఎన్నికయ్యారో ఆ పదవికి రాజీనామా చేసి పార్టీ ఫిరారుుంపులు చేయాలని తెలిపారు. ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కి నైతిక బాధ్యతను మరిచి ఇతర పార్టీలోకి చేరిన వా రు దిగజారిపోరుునట్టేనని తీ వ్రం గా వ్యాఖ్యానించారు.

టీడీపీ చైతన్యయాత్రల ముగింపులో నియోజకవర్గానికి చెందిన ప్రజా ప్రతి నిధులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన వారు టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారని, వారు ముందు తమ పార్టీ సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల నమ్మకానికి వెన్నుపోటు పొడిచి ఇతర పార్టీలో చేరడాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన సమయంలో 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేసి సత్తా నిరూపించారని గుర్తు చేశారు. పార్టీ ఫిరారుుంపులపై కోర్టును ఆశ్రరుుస్తామని తెలిపారు.
 

మరిన్ని వార్తలు