భగ్గుమన్న విభేదాలు

5 Nov, 2016 23:17 IST|Sakshi
భగ్గుమన్న విభేదాలు
  • టీడీపీ జనచైతన్య యాత్రలో తమ్ముళ్ల తన్నులాట  ∙
  • ఎమ్మెల్యే వర్సెస్‌ సర్పంచి వర్గం
  • రాచపల్లిలో ముష్టిఘాతాలు  
  • భారీగా పోలీసుల మోహరింపు
  • ప్రత్తిపాడు : 
    జనచైతన్య యాత్రలో టీడీపీలోని విభేదాలు భగ్గుమన్నాయి. ప్రత్తిపాడు మండలం రాచపల్లి గ్రామంలో శనివారం ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు సమక్షంలోనే తెలుగు తమ్ముళ్లు ముష్టి ఘాతాలకు దిగారు. పోలీసులు జోక్యం చేసుకొని కార్యకర్తలను చెదరగొట్టడంతో వివాదం సద్దుమణిగింది. వివరాలు ఇలా ఉన్నాయి...మండలంలోని గజ్జనపూడి, శరభవరం, రాచపల్లి గ్రామాల్లో శనివారం నిర్వహించిన జనచైతన్య యాత్రలో ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు పాల్గొన్నారు. మధ్యాహ్నం రాచపల్లి గుబ్బాలమ్మ గుడి వద్ద పార్టీ పతాకావిష్కరణ, అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వరుపుల శంకుస్థాపన చేయాలి. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచి బుద్దరాజు రామలక్ష్మి తోపాటు ఈమె భర్త పీహెచ్‌సీ అభివృద్ధి కమిటి చైర్మ¯ŒS బుద్దరాజు చంటిరాజు తన వర్గంతో చేరుకున్నారు. మధ్యాహ్నం టీడీపీ పతాకాన్ని ఆవిష్కరించి, అభివృద్ధిపనులను ప్రారంభించేందుకు ఆప్‌కాబ్‌ వైస్‌ చైర్మ¯ŒS వరుపుల రాజా, టీడీపీ నాయకులు పర్వత రాజబాబు, ఎంపీపీ బత్తుల లోవకుమారి, మాజీ ఎంపీపీ వరుపుల తమ్మయ్యబాబు, మాజీ సర్పంచి బుద్ధరాజు చంటిరాజులతో కలిసి  ఎమ్మెల్యే వరుపుల çసుబ్బారావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పతాకాన్ని ఆవిష్కరించే సమయాన గ్రామంలో అభివృద్ధి పనుల సమాచారం టీడీపీకే చెందిన సర్పంచికు గానీ, పార్టీ కార్యక్రమం గ్రామ పార్టీ అధ్యక్షునికి గానీ తెలియజేయాల్సిన అవసరం ఉందోలేదో చెప్పాలంటూ చంటిరాజు ప్రశ్నించారు. దీంతో వరుపుల వర్గీయులకు, చంటిరాజు వర్గీయులు ఒకరిపై ఒకరు అరుపులు, కేకలతో విరుచుకుపడ్డారు. ఒకరికొకరు పిడుగుద్దులకు దిగడంతో ఆ ప్రాంతంలోని మహిళలు ఇళ్లల్లోకి పరుగులు తీశారు.  ఈ సంఘటలో ఇరువర్గాలకు చెందిన మడికి కృష్ణ, బర్ల శ్రీను, ఉపసర్పంచి పెదిరెడ్డి నానీ, ఏనుగు శ్రీను మరో ఇరువురు స్వల్పంగా గాయపడ్డారు. అప్పటికే ప్రత్తిపాడు సీఐ జి. సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రత్తిపాడు, ఏలేశ్వరం, అన్నవరం ఎస్సైలు ఎం. నాగ దుర్గారావు, వై. రవికుమార్, పార్థసారథి ఆధ్వర్యంలో పోలీసులు మోహరించిన కార్యకర్తలను చెదరగొట్టారు. ఈలోగా ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి, అభివృద్ధి పనులకు కొబ్బరికాయ కొట్టడం, నాయకులంతా అక్కడనుంచి నిష్క్రమించడం జరిగిపోయింది. :ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు వాహనాన్ని అడ్డుకునేందుకు సర్పంచి బుద్దరాజు రామలక్ష్మి, ఆమె భర్త  పీహెచ్‌సీ అభివృద్ధి కమిటి చైర్మ¯ŒS చంటిరాజు తన వర్గీయులతో రాహదారిని దిగ్బంధించారు. వెంటనే పోలీసులు కలుగజేసుకుని ఎమ్మెల్యే కారుకు అడ్డంగా ఉన్న కార్యకర్తలను తొలగించడంతో ఎమ్మెల్యేకు మార్గం సుగమం అయింది.
     
మరిన్ని వార్తలు