హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దిష్టిబొమ్మ దహనం

27 Jun, 2016 20:01 IST|Sakshi

తెలంగాణ న్యాయమూర్తుల అసోసియేషన్ నేతలపై సస్పెన్షన్ ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా కామారెడ్డి బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు న్యాయవాదులు బార్ అసిసోయేషన్ ఆధ్వర్యంలో కోర్టుల నుంచి ర్యాలీ నిర్వహించారు. రైల్వే బ్రిడ్జి వద్ద రోడ్డుపై బైఠాయించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దిష్టిబొమ్మను దహనం చేశారు.

 

ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ న్యాయమూర్తుల నియామకంలో అన్యాయాన్ని నిరసిస్తూ తెలంగాణ న్యాయమూర్తులంతా రాజీనామాలకు సిద్ధపడిన నేపథ్యంలో నాయకత్వం వహించిన అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు రవీందర్‌రెడ్డి, వరప్రసాద్‌లను సస్పెండ్ చేశారని, వారిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రా న్యాయమూర్తులను తెలంగాణకు కేటాయించడాన్ని వెనక్కు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు క్యాతం సిద రాములు, సీనియర్ న్యాయవాదులు వీఎల్ నర్సింహారెడ్డి, మంద వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గన్నారు.  

 

మరిన్ని వార్తలు