చెరువులే జీవనాధారం

9 Jun, 2017 01:58 IST|Sakshi
చెరువులే జీవనాధారం

ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌
కరీంనగర్‌రూరల్‌: గ్రామాలకు చెరువులే జీవనాధారామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ అన్నారు. కరీంనగర్‌ మండలం బొమ్మకల్‌లో మిషన్‌ కాకతీయలో భాగంగా మల్లయ్య చెరువులో రూ.29.60 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులు గురువారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మల్లయ్య చెరువు ఆయకట్టు 65 ఎకరాల్లో ఉందన్నారు. మిషన్‌ కాకతీయ 1, 2వ విడుతల్లో చేపట్టిన చెరువుల అభివృద్ధితో నీళ్లు నిండి పంటల దిగుబడి పెరిగిందన్నారు.

మూడోదశలో మండలంలోని అన్ని చెరువులను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వచ్చే ఏడాది నుంచి ఎకరానికి రూ.4 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు చెప్పారు.ఎంపీపీ వి.రమేశ్, మార్కెట్‌ కమిటీ వైస్‌చైర్మన్‌ జె.రాజేశ్వర్‌రావు, ఎంపీటీసీ సభ్యులు డి.శ్రీనివాస్, వజ్రమ్మ, ఉపసర్పంచ్‌ శ్రీనివాస్, స్థానిక నాయకులు రమేశ్, దాది సుధాకర్, ర్యాకం మోహన్, శ్రీనివాస్, జె.శంకర్, కాల్వ నర్సయ్య, గౌతమ్‌రెడ్డి, ఆనందరావు, కె.సంపత్, తహసీల్దారు రాజ్‌కుమార్, ఆర్‌ఐ విజయ్, రూరల్‌ సీఐ శశిధర్‌రెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు