డిజిటల్ విధానంలో నగదు చెల్లింపులు

30 Nov, 2016 02:44 IST|Sakshi
డిజిటల్ విధానంలో నగదు చెల్లింపులు

రైతులు, కూలీలకు చెల్లించేందుకు చర్యలు
ఆర్టీజీఎస్ ద్వారా   పత్తి కొనుగోళ్ల చెల్లింపులు
కలెక్టర్ జ్యోతిబుద్ధప్రకాశ్  అధికారులతో సమావేశం

 
 ఆదిలాబాద్ అర్బన్ : నల్లధనాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేసిన నేపథ్యంలో రైతులు, కూ లీలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుం డా డిజిటల్ విధానంలో నగదు చెల్లింపులకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ జ్యో తిబుద్ధప్రకాశ్ బ్యాంకు అధికారులను ఆదేశించారు. రూ. 500, రూ.వెరుు్య నోట్ల రద్దుతో రైతులు, కూలీ లు ఎలాం టి ఇబ్బందులు పడొద్దని తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మం దిరంలో బ్యాంకు, వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతు లు, కూలీలు, సామాన్య ప్రజలు ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారని, ఆ ఇబ్బం దులను తొలగించేందుకు కేంద్ర ప్రభు త్వ నిబంధనల మేరకు అన్ని బ్యాంకు లు, మార్కెట్లు, వ్యాపారుల వద్ద డిజి టల్ పద్ధతి ద్వారా నగదు చెల్లింపుల సౌ కర్యాలు కల్పించాలని సూచించారు. సౌ కర్యాల కల్పించడంతోపాటు వారికి అవగాహన కల్పించే బాధ్యత బ్యాంకు అధికారులపై ఉందన్నారు.

బ్యాంకు ఖాతా లు లేని రైతులు, కూలీలు వెంటనే బ్యాంకు ఖాతాలు తెరిచి డిజిటల్ విధా నం ద్వారా అవగాహన పొంది నగదు లావాదేవీలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా రక్షణ పొందాలని కోరా రు. పత్తి రైతులకు ఆర్టీజీఎస్ ద్వారా పత్తి కొనుగోళ్ల చెల్లింపులు చేయాలని మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు. అ నంతరం వివిధ బ్యాంకు అధికారులు మాట్లాడుతూ బ్యాంకుల్లో సరిపడా డ బ్బు అందడం లేదన్నారు. రోజురోజుకు కేంద్ర ప్రభుత్వం నగదు విత్‌డ్రావల్స్ పరిమితి పెంచుతోందని, బ్యాంకుల్లో డబ్బు నిల్వలు లేనందున ప్రజల డి మాండ్ మేరకు నగదు లావాదేవీలు కొ నసాగించలేకపోతున్నామని పేర్కొన్నా రు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ కృష్ణారెడ్డి, జెడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి, డీఆర్డీఏ పీడీ రాజేశ్వర్ రాథోడ్, ఎల్‌డీఎం ప్రసాద్, వివిధ శాఖల అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు