దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానం కీలకం | Sakshi
Sakshi News home page

దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానం కీలకం

Published Wed, Nov 30 2016 2:41 AM

దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానం కీలకం - Sakshi

ఎస్పీ ఎం.శ్రీనివాస్
జిల్లా అధికారులతో  నేర సమీక్ష సమావేశం

 ఆదిలాబాద్‌క్రైం : కేసుల దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానా న్ని కీలకంగా మలుచుకోవాలని ఎస్పీ ఎం.శ్రీనివాస్ అ న్నారు. జిల్లాలో నేరాల అదుపుతో పోలీసు వ్యవస్థ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. మంగళవారం స్థానిక పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో పోలీసు సమావేశ మం దిరంలో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ని 21 పోలీసుస్టేషన్ల పురోగతి, పెండింగ్ కేసులు, వారెం ట్లు, శాంతిభద్రతల సమస్యలు, ఆర్థిక నేరాలు, సిబ్బంది ఖాళీల భర్తీ, తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు వ్యవస్థ నిరంతరంగా అభివృద్ధి చెందుతూ అనేక సాంకేతిక పరమైన మార్పులు వచ్చాయని తెలిపారు. వాటిని సద్వినియోగం చేసుకుని నిందితులను ముందస్తుగా గుర్తించి నేరాల నియంత్రణ కోసం చర్యలు చేపట్టాలని సూచించారు.

జిల్లాల విభజన అనంతరం ఆదిలాబాద్ జిల్లాలో నూతనంగా భీంపూర్, గాదిగూడ, సిరికొండ, మావల నాలుగు పోలీసుస్టేషన్లు ఏర్పడ్డాయని, వీటి సర్కిల్ కార్యాలయాలు జైనథ్, ఇచ్చోడ, నార్నూర్ ఏర్పడ్డాయని పేర్కొన్నారు. దీంతో ప్రజలకు పోలీసు వ్యవస్థ మరింత అందుబాటులోకి వచ్చిందన్నారు. అక్టోబర్ 11 తర్వాత జిల్లా వ్యాప్తంగా 8 మట్కా కేసుల కేసులు నమోదు కాగా, 31 మందిని అరెస్టు చేసి రూ.62,820 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పేకాటలో 12 కేసులు నమోదు కా గా, 54 మందిని అరెస్టు చేసి రూ.21,010 నగదు స్వాధీనపర్చుకున్నట్లు వివరించారు. గుట్కా అమ్మేవారిపై 14 కేసులు నమోదు చేసి 20 మందిని అరెస్టు చేయడంతోపా టు రూ.12లక్షల 35వేల నిషేధిత గుట్కాలను స్వాధీనం చేసుకున్నామని, దేశీదారు వ్యాపారం చేస్తున్న ఏడుగురిపై కేసులు నమోదు చేసి 12 మందిని అరెస్టు చేశామని, 236 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. బెల్టుషాపుల్లో మద్యం అమ్మకుండా 11 కేసులు నమోదు చేశామని, 16 మందిని అరెస్టు చేసి 350 లిక్కర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మహిళ ల భద్రతను దృష్టిలో ఉంచుకుని మరో రెండు షీటీమ్‌ల ను ఏర్పాటు చేసి నిఘా పెంచినట్లు తెలిపారు. త్వరలో ప ట్టణంలో పోలీసు సబ్‌కంట్రోల్ రూమ్‌లను పునఃప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందికి ఎలాంటి వ్యక్తిగత సమస్యలున్నా నేరుగా తెలుపాలని సూచించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ టి.పనసారెడ్డి, ఆదిలాబాద్, ఉట్నూర్ డీఎస్పీలు ఎ.లక్ష్మినారాయణ, ఎస్.మల్లారెడ్డి, సీసీఎస్ కె.నర్సింహారెడ్డి, సీతారాములు, ఏఆర్ ఎండి బుర్హాన్‌అలీ, సీఐలు ఎన్.సత్యనారాయణ, కె.వెంకటస్వామి, ఎండి షేర్ అలీ, పోతారాం, శ్రీనివాస్, ఎ.కరుణాకర్, జయరాం, జైపాల్, గణపత్ జాదవ్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ బి.ప్రవీణ్, ఎస్సైలు అన్వర్‌ఉల్ హఖ్, డి.పద్మ, రాజలింగం, ఆర్‌ఐ బి.జెమ్స్, ఆర్‌ఎస్సై బి.పెద్దయ్య, డి.మోహన్, పుల్లయ్య అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement