అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలం

2 Jun, 2016 09:21 IST|Sakshi
అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలం

ఎమ్మెల్సీ అభ్యర్థి గోపాల్‌రెడ్డి

కడప రూరల్: రాష్ర్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం చెందిందని    పశ్చిమ రాయలసీమ 2017 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి,  ఎన్జీఓ అసోసియేషన్ రాష్ర్ట మాజీ అధ్యక్షుడు   వెన్నపూస గోపాల్‌రెడ్డి ఆరోపించారు. స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం  ఉద్యోగులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. పది నెలల పీఆర్సీ అరియర్స్ ఇంతవరకు మంజూరు కాలేదన్నారు. రెండు డీఏల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. హెల్త్‌కార్డుల అమలు జరగలేదన్నారు. సీబీఎస్ విధానం రద్దు పరచడంతోపాటు నిరుద్యోగులకు రూ. 2 వేల భృతిని ప్రతినెల చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం తాను వైఎస్సార్ సీపీ తరపున పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా బరిలోకి దిగనున్నట్లు తెలిపారు.


 ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్స్, నిరుద్యోగుల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ పి.అశోక్‌కుమార్‌రెడ్డి, రాష్ర్ట నాయకుడు యల్లారెడ్డి, అనంతపురం జిల్లా కన్వీనర్ ఓబుల్‌రావులు మాట్లాడుతూ రాజగోపాల్‌రెడ్డికి తమ ఐక్యవేదిక సంపూర్ణ మద్దతును తెలుపుతున్నమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ టీఎఫ్ జిల్లా కన్వీనర్ పి.రెడ్డెప్పరెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఎస్వీ రమణారెడ్డి, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నాయకుడు ప్రభాకర్, ఏపీపీ టీఏ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు