జిల్లాలో వెయ్యి మినీడెయిరీల ఏర్పాటుకు చర్యలు

1 Oct, 2016 23:49 IST|Sakshi
జిల్లాలో వెయ్యి మినీడెయిరీల ఏర్పాటుకు చర్యలు
చిప్పగిరి : జిల్లాలో రూ.35 కోట్లతో వెయ్యి మినీ డెయిరీలను ఏర్పాటు చేసేందుకు ప్రాణాళికలు సిద్ధం చేసినట్లు  డీఆర్‌డీఏ పీడీ రామకృష్ణ చెప్పారు. శనివారం ఆయన చిప్పగిరిలోని వెలుగు కార్యాలయాన్ని  తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ S జిల్లాలో 9.80 లక్షల మందిని చంద్రన్నబీమా సదుపాయం కల్పించినట్లు చెప్పారు. అలాగే జిల్లాలో లక్ష మంది మహిళలకు జీవనోపాధుల నిమిత్తం (బర్రెలు, పొట్టేళ్లు తదితర వాటిపై) రుణాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.  జీరో ఖాతాను మండలంలోని ఎంతమంది పొదుపుమహిళలు  ఓపెన్‌ చేశారని పీడీ ఆరాతీశారు.  రూ.100తో  అకౌంట్‌ తెరుస్తున్నట్లు  మహిళా మండల అధ్యక్షురాలు అనంతమ్మ పీడీకి తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌ దష్టికి తీసుకెళ్లి బ్యాంకర్లు జీరో అకౌంట్లు తెరిచేలా చూస్తానన్నారు.  జీరో ఖాతాలు ఉంటే చంద్రన్న బీమా డబ్బులు రావన్నది అపోహ మాత్రమేనని చెప్పారు. పీడీ వెంట  స్త్రీనిధి ఏజీఎం మురళీకష్ణ, పత్తికొండ ఏరియా  కో–ఆర్డినేటర్‌ సురేష్, ఏపీఎం నాగార్జున, సీసీ ఉమాపతి ఉన్నారు. 
 
>
మరిన్ని వార్తలు