శుభలేఖలు పంచడానికి వెళుతూ..

1 Apr, 2016 01:53 IST|Sakshi
శుభలేఖలు పంచడానికి వెళుతూ..
మరో రెండు రోజులు గడిస్తే ఆ ఇంట్లో పెళ్లి బాజాలు మొగనున్నాయి. వివాహ వేడకను వైభ
 వంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.. వేడకకు బంధువులందరినీ ఆహ్వా
 నించేందుకు ముగ్గురు యువకులు బైక్‌పై బయలుదేరారు.. కాసేపటికే పిడుగులాంటి వార్త.. 
 ఇంటి వద్ద నుంచి వెళ్లిన యువకులు మృత్యుకోరలకు చిక్కుకుపోయారన్న చేదు నిజం తండా
 వాసులను కలచివేసింది. పెళ్లింట విషాదఛాయలు అలుముకున్నాయి. 
 
 తుర్కపల్లి :  తుర్కపల్లి మండలం  పెద్దతండా పరిధి జాలుబావి తండాకు చెందిన హస్లీ, బిచ్చాల కూతురు వివాహం ఈ నెల 3 తేదీన రాజపేట మండలం పుట్టగూడేనికి చెందిన వ్యక్తితో జరగనుంది. దీంతో పత్రికలు పంచడానికి పెళ్లి కూ తురు సోదరుడు (చిన్నమ్మ కొడుకు) ధనావత్ గణేశ్(17), అతడి మిత్రుడు భానోత్ మల్లేశ్ (18) రాజపేట మండలం పుట్టగూడేనికి  చెంది న మాలోత్ సాయికుమారు(19) గురువారం బైక్‌పై తండా నుంచి బయలుదేరారు. ఈ క్రమంలో ముల్కలపల్లి గ్రామశివారులోని మూ ల మలుపు వద్ద ఎదురుగా వస్తున్న లారీ వీరి బైక్‌ను ఢీకొట్టడంతో తీవ్రగాయాలై అక్కడికక్క డే మృతిచెందారు. మృతదేహాలు చెల్లాచెదురు గా రోడ్డుపై పడి పోయాయి. 
 
 మిన్నంటిన రోదనలు
 ప్రమాద విషయం తెలుసుకుని మృతుల కుటు ంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటి వరకు తమతో పాటే ఉన్న యు వకులు మృత్యువాత పడడంతో కుటుంబ స భ్యుల రోదనలు మిన్నంటాయి.  గణేశ్, మ ల్లేశ్ ఇద్దరూ భువనగిరి ప్రభుత్వ కళశాలల్లో ఇం ట ర్మీడియట్ చదువుతుండగా, సాయికుమారు ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. గణేశ్‌కు ఇద్దరు చెల్లెలు అమ్మనాన్న ఉన్నారు. మల్లేశ్‌కు ముగ్గురు అక్కలు, ఓచెల్లె అమ్మనాన్న ఉ న్నారు. వీరిని ఢీ కొట్టిన లారీ జాడ తెలియరాలే దు. సంఘటన స్ధలానికి డీఎస్పీ మోహన్‌రెడ్డి పరిశీలించారు.  పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలిం చారు.   సీఐ రఘువీరారెడ్డి, ఎస్‌ఐ మదుసుధన్‌రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 
 బాధిత కుటుంబలాను అదుకోవాలి
 బాధిత కుటుంబాలను ప్రభుత్వం అదుకోవాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు. మృతుని కుటుంబాలను పరిమర్శించి మృతి చెందిన గణేశ్, మల్లేశ్ కుటుంబాలకు రూ. 5వేల చొప్పున అందజేశారు.
 
మరిన్ని వార్తలు