డిజిటల్ ఇంటిగ్రేషన్ పై ఎన్ఐఐటీ దృష్టి

1 Apr, 2016 01:54 IST|Sakshi
డిజిటల్ ఇంటిగ్రేషన్ పై ఎన్ఐఐటీ దృష్టి

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్ సంస్థ... డిజిటల్ ఇంటిగ్రేషన్‌పై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా గతేడాది కొనుగోలు చేసిన డిజిటల్ టెక్నాలజీ సేవలను అందించే ఇన్సెశాంట్ టెక్నాలజీస్‌ను భారీగా విస్తరిస్తోంది. సుమారు రూ.20 కోట్లతో హైదరాబాద్‌లో ఇన్సెశాంట్ ఏర్పాటు చేసిన డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్‌ను (ఆర్‌అండ్‌డీ) తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు గురువారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుధీర్ చతుర్వేది మాట్లాడుతూ ఆటోమేషన్, రోబోటిక్ వంటి ప్రధానమైన ఆరు డేటా ఇంటిగ్రేషన్ సేవలపై దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. ఖాతాదారులకు కావాల్సిన సేవలను అతి తక్కువ సమయంలోనే అందించేలా ఇక్కడ ఆర్‌అండ్‌డీ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలి పారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా డిజిటల్ ఇంటిగ్రేషన్ మార్కెట్ విలువ 5 బిలియన్ డాలర్లుగా ఉందని, ఇది వచ్చే ఐదేళ్లలో 20 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు ఇన్సెశాంట్ టెక్నాలజీస్ సీఈవో విజయ్ మద్దూరి తెలిపారు.

మరిన్ని వార్తలు