దేశ సేవకు పునరంకితం కావాలి

27 Jul, 2016 00:04 IST|Sakshi
దేశ సేవకు పునరంకితం కావాలి
అనంతపురం సెంట్రల్‌ :  కార్గిల్‌ యుద్ధంలో భారత సైనికుల పోరాటం, వారి ప్రాణత్యాగాన్ని  ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని దేశ సేవకు పునరంకితం కావాలని మాజీ సైనికులు పిలుపునిచ్చారు. కార్గిల్‌ విజయ్‌ దివస్‌ సందర్భంగా నగరంలో మంగళవారం జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆర్ట్స్‌ కళాశాల నుంచి టవర్‌క్లాక్, సుభాష్‌రోడ్డు మీదుగా సప్తగిరి సర్కిల్‌ చేరుకుని అక్కడ అమరవీరుల స్తూపం వద్ద ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా సైనిక సంక్షేమాధికారి తిమ్మప్ప, మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కెప్టెన్‌ షేకన్న మాట్లాడుతూ  మాట్లాడుతూ ప్రాణాలను ఎదురొడ్డి దేశరక్షణకు అహర్నిశలు పోరాడుతున్న భారత సైనికులు, అమరుల జీవితాలు అందిరికీ స్ఫూర్తిదాయం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం హెచ్చెల్సీ కాలనీలో మాజీ సైనికులతో సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి, సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్, డాక్టర్‌ రామసుబ్బయ్య, డిప్యూటీ మేయర్‌ గంపన్న, టౌన్‌ బ్యాంకు అధ్యక్షులు మురళీ, తదితరులు పాల్గొన్నారు. 
కొవ్వొత్తుల నివాళి..
కార్గిల్‌ అమర వీరులకు బీజేపీ నాయకులు ఘన నివాళులర్పించారు. మంగళవారం టవర్‌క్లాక్‌ వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి వారి సేవలు కొనియాడారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి దుద్దకుంట వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత యువత కార్గిల్‌ అమరవీరులను స్ఫూర్తిగా తీసుకుని దేశ సేవకు నడుంబిగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నగర అధ్యక్షులు శ్రీనివాసులు, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి, నాయకులు లలిత్‌కుమార్, శ్రీనివాసులు, గోవిందరాజులు, చంద్రశేఖర్, సోమయ్య, సయ్యద్‌ తదితరులు పాల్గొన్నారు.  
మరిన్ని వార్తలు