నేడు జగన్‌ మహాధర్నా

5 Feb, 2017 23:29 IST|Sakshi
నేడు జగన్‌ మహాధర్నా

హంద్రీ-నీవా ఆయకట్టుకు నీరివ్వాలని డిమాండ్‌
ఉరవకొండఽలో పూర్తయిన ఏర్పాట్లు
అమ్మవారిపల్లిలో భూనిర్వాసిత రైతులతో భేటీ కానున్న విపక్షనేత


ఐదేళ్లుగా హంద్రీ–నీవాకు నీళ్లొస్తున్నా ఆయకట్టుకు నీరిచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. కనీసం మొదటి దశకు నీళ్లిచ్చినా 1.18 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. కానీ డిస్ట్రిబ్యూటరీలపై ప్రభుత్వం నిర్లిప్తత ప్రదర్శిస్తోంది. ఓవైపు సాగునీరు లేక పంటలు పండక రైతులు, రైతు కూలీలు కేరళ, తమిళనాడు, కర్ణాటకకు వలస వెళుతున్నారు. ఏ దారీ లేని ఇంకొందరు ఆత్మహత్యలకు తెగిస్తున్నారు. అయినా ప్రభుత్వం కనిపకరం చూపడం లేదు.  పొలాలకు నీరిచ్చి రైతులను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. ఈ క్రమంలో విపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు ఉరవకొండలో ధర్నా చేయనున్నారు.

ఇందుకోసం ఉరవకొంఽడ క్లాక్‌టవర్‌ వద్ద ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. దీంతో పాటు  గొల్లపల్లి రిజర్వాయర్‌ సమీపంలో పారిశ్రామిక వాడకోసం భూములు కోల్పోతున్న రైతులతోనూ జగన్‌మోహన్‌రెడ్డి ముఖాముఖి నిర్వహించనున్నారు. వాస్తవానికి  గొల్లపల్లి రిజర్వాయర్‌కు నీళ్లొచ్చాయి, బంగారు పంటలు పండుతాయని రైతులు ఆశపడ్డారు. కానీ  ప్రభుత్వం మాత్రం పారిశ్రామిక వాడ పేరుతో వారి భూములను బలవంతంగా లాక్కునేందుకు సిద్ధమైంది. దీన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమ బతుకుతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఎన్ని లక్షలు ఇచ్చినా భూములు ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో అమ్మవారిపల్లి రైతులతో జగన్‌మోహన్‌రెడ్డి భేటీ కానున్నారు.
– సాక్షిప్రతినిధి, అనంతపురం 

>
మరిన్ని వార్తలు