పుష్కరాల్లో హైవేపై ట్రాఫిక్‌ మళ్లింపు

9 Aug, 2016 01:29 IST|Sakshi
పుష్కరాల్లో హైవేపై ట్రాఫిక్‌ మళ్లింపు
ఏలూరు (మెట్రో) : కృష్ణా పుష్కరాల సందర్భంగా 12వ తేదీ నుంచి జిల్లా మీదుగా వెళ్లే భారీ వాహనాలను దారి మళ్లిస్తున్నట్టు ఏలూరు రేంజ్‌ డీఐజీ పి.వి.రామకృష్ణ తెలిపారు. సోమవారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.  
దారి మళ్లింపు ఇలా 
∙చెన్నై వైపు వెళ్లాల్సిన భారీ వాహనాలను కత్తిపూడి – అమలాపురం– చించినాడ– పాలకొల్లు– భీమవరం– కైకలూరు– గుడివాడ– చల్లపల్లి మీదుగా ఒంగోలు పంపిస్తారు. అలాగే రాజమండ్రి నుంచి వచ్చే వాహనాలను రాజమండ్రి– సిద్ధాంతం బ్రిడ్జి – తాడేపల్లిగూడెం– ఆకివీడు – గుడివాడ– చల్లపల్లి– రేపల్లె– ఒంగోలు మీదుగా చెన్నై పంపిస్తారు అలాగే నారాయణపురం– గణపవరం– ఉండి– ఆకివీడు – కైకలూరు– గుడివాడ – చల్లపల్లి– రేపల్లె మీదుగా ఒంగోలు పంపిస్తారు. అలాగే  రాజమండ్రి– సిద్ధాంతం బ్రిడ్జి – హనుమాన్‌ జంక్షన్‌– గుడివాడ– చల్లపల్లి– మోపిదేవి– రేపల్లె– ఒంగోలు మీదుగా కూడా చెన్నై తరలిస్తారు. అలాగే దేవరపల్లి – గుండుగొలను – నారాయణపురం– గణపవరం– ఉండి– ఆకివీడు– కైకలూరు– గుడివాడ–చల్లపల్లి– మోపిదేవి– రేపల్లె– ఒంగోలు మీదుగా కూడా  చెన్నై తరలిస్తారు. 
∙కోల్‌కతావైపు వెళ్లాల్సిన వాహనాలను  ఒంగోలు – రేపల్లె– మోపిదేవి– చల్లపల్లి– మచిలీపట్నం– పెడన– కృత్తివెన్ను – లోసరి– నర్సాపురం – చించినాడ– రాజోలు– అమలాపురం– కాకినాడ – కత్తిపూడి మీదుగా పంపిస్తారు. అలాగే ఒంగోలు – రేపల్లె– మోపిదేవి– చల్లపల్లి– గుడివాడ– హనుమాన్‌జంక్షన్‌– సిద్ధాంతం బ్రిడ్జి– రాజమండ్రి మీదుగా కూడా విశాఖపట్నం తరలిస్తారు. అలాగే ఒంగోలు– రేపల్లె– మోపిదేవి– చల్లపల్లి– గుడివాడ– కైకలూరు– ఏలూరు– సిద్ధాంతంబ్రిడ్జి– రాజమండ్రి మీదుగా విశాఖపట్నం తరలిస్తారు. 
 
మరిన్ని వార్తలు