పట్టాలు తప్పిన హీరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌

22 Jan, 2017 15:11 IST|Sakshi
పట్టాలు తప్పిన హీరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌

పట్టాలు తప్పిన హీరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌
41 మంది మృతి.. 25 మృతదేహాలు వెలికితీత
విజయనగరం జిల్లా కొమరాడ వద్ద అర్ధరాత్రి ప్రమాదం
100 మందికి పైగా తీవ్రగాయాలు
8 బోగీలు బోల్తా.. ఒక ఏసీ బోగీ సహా ఐదు బోగీలు పూర్తిగా నుజ్జునుజ్జు


సాక్షి, విజయనగరం/విశాఖపట్నం: ఏపీలోని విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌ నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ వెళ్తున్న హీరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ కొమరాడ మండలం కూనేరు సమీపంలో శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో పట్టాలు తప్పింది. దీనితో ఇంజన్‌ సహా పలు బోగీలు బోల్తా పడ్డాయి. నాలుగు బోగీలు పక్క ట్రాక్‌పైనే వెళ్తున్న గూడ్స్‌ రైలును ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో 41 మందికిపైగా  మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి రెండున్నర గంటల సమయానికి 25 మృతదేహాలను వెలికితీశారు. పలు బోగీలు నుజ్జునుజ్జు కావడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. 100 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం అందింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.