కలెక్టర్‌తో శ్రీనివాస్‌గౌడ్ భేటీ

27 Oct, 2016 05:19 IST|Sakshi
కలెక్టర్‌తో శ్రీనివాస్‌గౌడ్ భేటీ

ఖమ్మం సహకారనగర్ : జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్‌ను గెజిటెడ్ అధికారుల సంఘం గౌరవాధ్యక్షుడు, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు.  బుధవారం ఖమ్మం జిల్లాకు వచ్చిన సందర్భంగా తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా నేతలతో కలిసి కలెక్టర్‌ను కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై కలెక్టర్‌తో మాట్లాడారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు ఆళ్ల శ్రీనివాసరెడ్డి, గౌరవాధ్యక్షుడు షేక్ ఖాజామియా పాల్గొన్నారు.  
 
 నేడు టీఎస్‌పీఎస్సీ సభ్యుడి పర్యటన
 ఖమ్మం సహకారనగర్: టీఎస్‌పీఎస్సీ సభ్యుడు బి.మన్మథరెడ్డి గురువారం జిల్లాలో పర్యటించనున్నట్లు పరీక్షల జిల్లా కోఆర్డినేటర్ వెంకట రామారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నవంబర్ 11, 13వ తేదీల్లో జరిగే గ్రూప్-2 పరీక్ష నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షించనున్నారు. సమావేశానికి గ్రూప్-2 పరీక్షలకు నియమించిన చీఫ్ సూపరింటెండెంట్లు, లైజన్ అధికారులు, సం బంధిత శాఖాధికారులు హాజరుకావాలని కోరారు.
 
 కబడ్డీ పోటీల్లో ఖమ్మం జట్టు ముందంజ    
 కరీంనగర్ స్పోర్‌‌ట్స: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వివేకానంద రెసిడెన్షియల్ స్కూల్‌లో సీబీఎస్‌ఈ స్కూల్ క్లస్టర్ కబడ్డీ పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి 13 బాలురు, 5 బాలికల జట్లు పాల్గొంటున్నాయి. 200 మంది క్రీడాకారులు 50 మంది అధికారులు హాజరయ్యారు. కాగా, తొలిరోజు బాలుర విభాగంలో చైతన్య సెంట్రల్‌స్కూల్ (మహబూబ్‌నగర్)పై హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్ (ఖమ్మం) 52-28 తేడాతో విజయం సాధించింది.  
 
 డిజిటల్ ఇండియా పోటీల్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ
 ఖమ్మం జెడ్పీసెంటర్: ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీలో నిర్వహించిన నేషనల్ ఈ గవర్నస్ డివిజన్ డిజిటల్ ఇండియా ప్రతిభా పోటీల్లో జిల్లాకు చెందిన ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. పోటీల్లో ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ డిగ్రీకళాశాల విద్యార్థులు ప్రదర్శించిన ఈ-హాస్పిటల్ నాటికకు ప్రథమబహుమతి లభించింది. పోటీల్లో ఉత్తమ ప్రదర్శనచేసి బహుమతి పొందిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వీరభద్ర య్య బుధవారం కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ జిల్లా సమన్వయకర్త జగదీశ్వరరావు, ప్రోగ్రామ్ అధికారులు చంద్రశేఖర్, సర్వేశ్వర్‌రావును అభినందించారు.
 

మరిన్ని వార్తలు