బ్రహ్మాండంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు

16 Sep, 2016 19:56 IST|Sakshi

తిరుమల : తిరుమలేశుని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని, ఇందుకోసం ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేశామని టీటీడీ ఈవో డి.సాంబశివరావు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అక్టోబరు 3 నుంచి 11వ తేదీ వరకు జరుగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఏరోజుకారోజు స్వామివారి దర్శనమయ్యేలా చర్యలు చేపట్టామన్నారు. ఉత్సవాల సందర్భంగా అన్ని ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్టు చెప్పారు.

వాహన సేవలు నిర్దేశించిన సమయానికే ప్రారంభించి, తిరిగి పూర్తి చేసే ఏర్పాట్లు చేశామన్నారు. భక్తుల సౌకర్యార్థం 24 గంటల పాటు రెండు ఘాట్ రోడ్లను తెరచి ఉంచుతామన్నారు. ఆర్‌టీసీ బస్సులు సాధారాణ రోజుల్లో 2 వేల ట్రిప్పులు, గరుడసేవ రోజు 3,500 ట్రిప్పులు తిరుగుతాయన్నారు. ఘాట్ రోడ్లలో వాహనాలు మరమ్మతులకు గురైనపుడు వెంటనే స్పందించేందుకు వీలుగా క్రేన్లు, మెకానిక్ సిద్ధంగా ఉంచుతామన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా 7 లక్షల లడ్డూలను నిల్వ ఉంచుతామన్నారు.

మరిన్ని వార్తలు