శ్రీశైలం పురవీధుల్లో... ఇక వాహనాలు తిరగరాదు !

29 Aug, 2016 00:09 IST|Sakshi
శ్రీశైలం పురవీధుల్లో... ఇక వాహనాలు తిరగరాదు !
శ్రీశైలం:  శ్రీశైల మహాక్షేత్రంలోని ప్రధాన పురవీధులైన పాతాళగంగరోడ్డు, పోస్టాఫీస్‌ రోడ్ల ద్వారా ప్రధాన మాడా వీధికి ముందున్న గంగాధర మండపం కూడలి వరకు ఎలాంటి వాహనాలు తిరగరాదని దేవస్థానం అధికారులు ఆంక్షలు విధించారు. ఆదివారం నుంచి క్యాంటీన్‌ నెం 1 పై భాగం Vó ట్‌ ద్వారా వచ్చే టూ వీలర్స్‌ను కూడా ఈ రెండు ప్రధాన వీధుల్లోకి సెక్యూరిటీ సిబ్బంది అనుమతించ లేదు. దేవస్థానం ఈఓ నారాయణ భరత్‌ గుప్త ఆదేశాల మేరకు ఎలాంటి వాహనాలు అనుమతించబోమని, కేవలం వీఐపీ, వీవీఐపీలకు సంబంధించిన వాహనాలను మాత్రమే లోనికి పంపిస్తామని తెలిపారు. దీంతో ఆ పురవీధుల్లో ఉన్న స్థానిక వ్యాపారస్తులు తమకు వ్యాపార నిమిత్తమై వచ్చే సరుకులను లోనికి తీసుకురావడానికి తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాటర్‌ క్యాన్‌ వాహనాలను కూడా అనుమతించకపోవడంతో మంచినీటి కోసం యాత్రికులు బాటిల్స్‌ను కొనాల్సి వచ్చింది. స్థానికులు, వ్యాపారస్తులు, ఈ రెండు పురవీధుల్లో, సత్రాల్లో నివాసితులు ఉంటున్న వారు  టూ వీలర్‌ మీద వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై ఈఓతో చర్చించేందుదకు స్థానికులు, వ్యాపారాఉలు సిద్ధమవుతున్నారు.   
 
మరిన్ని వార్తలు