శభాష్‌..తేజేశ్వరరెడ్డి

8 Feb, 2017 22:26 IST|Sakshi
శభాష్‌..తేజేశ్వరరెడ్డి
– 35వ సీనియర్‌ నేషనల్‌ రోయింగ్‌ చాంపియన్‌షిప్‌ ఆఫ్‌ ఇండియాలో బంగారు పతకం కైవసం 
– ఆటల్లో మరోసారి జిల్లా పోలీస్‌ శాఖ ప్రతిష్టను ఇనుమడింపజేసిన వైనం 
 
కర్నూలు(కొండారెడ్డిఫోర్ట్‌) : జిల్లా పోలీసు క్రీడాకారిగా గుర్తింపు పొందిన తేజేశ్వర్‌రెడ్డి ఖాతాలో మరో బంగారు పతకం చేరింది. ఇప్పటికే ఏషియన్‌ చాంపియన్‌షిప్‌తో పాటు పలు పోటీల్లో పాల్గొని జిల్లా పోలీసు శాఖ ప్రతిష్టతను పెంచారు. ఈ నేపథ్యంలో 35వ సీనియర్‌ రోయింగ్‌  చాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని సాధించి జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణతో బుధవారం అభినందనలు అందుకున్నారు.
 
తేజేశ్వర్‌రెడ్డి సాధించిన పతకాలు:
జనవరి 27వ తేదీ నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగిన 35వ సీనియర్‌ నేషనల్‌ రోయింగ్‌ చాంపియన్‌షిప్‌ ఆఫ్‌ ఇండియాలో తేజేశ్వరరెడ్డి బంగారు పతకం సాధించాడు. 22 రాష్ట్రాల నుంచి పోలీసు క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఆరుగురు పాల్గొనగా మెన్స్‌ సింగిల్స్‌ స్కల్‌ 2000 మీటర్ల విభాగంలో తేజేశ్వర్‌రెడ్డి బంగారు పతకాన్ని సాధించారు. గతంలోనూ థాయ్‌ల్యాండ్‌లో జరిగిన ఏషియన్‌ రోయింగ్‌ చాంపియన్‌షిప్‌లో రెండు పతకాలు సాధించారు. 34వ సీనియర్‌ నేషనల్‌ రోయింగ్‌ చాంపియన్‌షిప్‌లో ఒక కాంస్యపతకాన్ని సాధించారు. 
కుటుంబ నేపథ్యం.. 
ఓర్వకల్లు గ్రామానికి చెందిన వెంకట్రామిరెడ్డి, క​ృష్ణవేణమ్మల రైతు దంపతుల కుమారుడైన తేజేశ్వర్‌రెడ్డి 2013లో జిల్లా పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా చేరారు. విద్యాభ్యాసం పదోతరగతి వరకు ఓర్వకల్లులో, ఇంటర్, డిగ్రీ సెయింట్‌ జోషఫ్‌ కళాశాలలో పూర్తి చేశారు. 
 
 ఏషియన్‌ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకమే లక్ష్యం:
 2018లో జరిగే ఏషియన్‌ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. అందుకోసం తీవ్రంగా కృషి చేస్తున్నాను. నా విజయాలకు కోచ్, తల్లిదండ్రులు, జిల్లా పోలీసు ఉన్నతాధికారుల సహకారం మరువలేనిది
 
మరిన్ని వార్తలు