పారా ఆర్చర్‌ శీతల్‌కు స్వర్ణం, రజతం 

23 Nov, 2023 04:21 IST|Sakshi

ఆసియా పారా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు నాలుగు స్వర్ణాలు, నాలుగు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి మొత్తం తొమ్మిది పతకాలు లభించాయి. ఆసియా పారా గేమ్స్‌లో రెండు స్వర్ణాలు నెగ్గి అందరి ప్రశంసలు అందుకున్న శీతల్‌ దేవి ఆసియా చాంపియన్‌షిప్‌లోనూ రాణించింది.

రెండు చేతులు లేకున్నా తన కాళ్లతో విల్లు ఎక్కుపెట్టి బాణాలు సంధించే శీతల్‌ ఈ టోర్నీలో మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో రాకేశ్‌తో కలిసి స్వర్ణం... వ్యక్తిగత విభాగంలో రజత పతకం సాధించింది. వ్యక్తిగత విభాగం ఫైనల్లో శీతల్‌ దేవి ‘షూట్‌ ఆఫ్‌’లో సింగపూర్‌ ప్లేయర్‌ నూర్‌ సియాదా చేతిలో ఓడిపోయింది.    

మరిన్ని వార్తలు