నిర్లక్ష్యానికి మూల్యం నీటి కష్టాలు

24 Aug, 2016 00:29 IST|Sakshi
నిర్లక్ష్యానికి మూల్యం నీటి కష్టాలు
  •  లక్షల వ్యయంతో ట్యాంకుల నిర్మాణం
  • నాణ్యతాలోపంతో అందని చుక్క నీరు
  • అధికారుల పర్యవేక్షణ లోపం
  •  గుత్తేదారుల ఇష్టారాజ్యం
  • బజార్‌హత్నూర్‌: మండలంలోని ప్రజల తాగునీటి కష్టాలు చిత్రంగా ఉన్నాయి. తాగునీటి సమస్యను పరిష్కరించుటకు కోట్ల రూపాయాల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఆ నిధులతో గ్రామాలలో వాటర్‌ట్యాంకులు నిర్మాణాలు చేపట్టారు. కానీ స్థానిక అధికారుల నిర్లక్ష్యంతో ఆయా గ్రామాల ప్రజలకు తాగునీటి తిప్పలు తప్పడం లేదు.
    వాస్తవ పరిస్థితులు ఇవే...
    ప్రభుత్వం మండలంలో రాంనగర్, బలాన్‌పూర్, కొత్తపల్లి, కొత్తగూడ, మాన్కాపూర్, తూకాన్‌పల్లి, జల్లుగూడ, కిన్నర్‌పల్లి గ్రామాలలో ఒక్కొక్క వాటర్‌ట్యాంక్‌ నిర్మాణానికి రూ.11లక్షల నిధులు కేటాయించింది. 2014 సంవత్సరంలో ఆయా గ్రామాలలోని వాటర్‌ట్యాంక్‌ల నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి. నాటి నుంచి నేటి వరకు వాటి నిర్వహణ గాలి వొదిలేయడంతో ఎనిమిది గ్రామాల ప్రజలకు నీటి కష్టాలు తప్పడం లేదు.   నిర్మాణం పూరై ్తయిన వాటర్‌ట్యాంకులను స్థానిక గ్రామ పంచాయితీ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా అవి అలంకారప్రాయంగా మిగిలిపోయాయి. ఇదే విషయంపై సర్పంచులను సంప్రదిస్తే బోరుబావుల్లో నీరులేదని, పైపులైన్‌ లీకేజీ ఉందని, కరెంటు సరఫరా లేదని ఒక్కొక్కరూ ఒక్కొక్క కారణం తెలుపుతున్నారు.
    నిర్మాణ లోపమే కారణమా.. 
    వాటర్‌ ట్యాంకుల నిర్మాణం పూరై ్త రెండు సంవత్సరాలు గడిచినా నేటికీ చుక్క నీరు అందడం లేదు. అధికారులను సంప్రదిస్తే  వాటర్‌ట్యాంకుల నిర్మించిన గుత్తేదారులకు బిల్లులు మంజూరు కాలేదని గుత్తేదారులు వాటర్‌ట్యాంకులను గ్రామపంచాయతీలకు అప్పగించలేదని తెలిపారు. మరో కోణంలో చూస్తే వాటర్‌ట్యాంకుల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించలేదని అన్ని కూడా లీకేజీల సమస్యతో సతమతమవుతున్నందునే బిల్లులు మంజూరు కాలేదని  తెలుస్తోంది. ఇటు ప్రభుత్వ నిర్లక్ష్యంతో గ్రామీణుల నీటికష్టాలు అధికమవుతున్నాయి. ఏదిఏమైనప్పటికీ  సాధ్యమైనంత త్వరగా వాటర్‌ట్యాంకులకు నీటి కనెక్షన్‌ ఇచ్చి తమ తాగునీటి కొరత తీర్చాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికే పొలం బావుల నుంచి నీటిని తీసుకొస్తున్నామని ఆయా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
     
     
మరిన్ని వార్తలు