సాగర్‌, జూరాలకు కొనసాగుతున్న వరద

11 Aug, 2016 08:55 IST|Sakshi

మహబూబ్‌నగర్‌/నల్లగొండ: జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 318.208 అడుగులకు చేరింది. అయితే ఇన్‌ఫ్లో 2,35,000 క్యూసెక్కులు ఉండగా, ఔట్‌ఫ్లో 2,53,659 క్యూసెక్కుల నీటిని 13 గేట్లు ఎత్తి అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు.

అదేవిధంగా నల్లగొండ జిల్లాలో నాగార్జున సాగర్‌కు స్వల్పంగా వరద పెరిగింది. దీని పూర్తిస్థాయి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 506.70 అడుగులకు చేరింది. ఇందులో ఇన్‌ఫ్లో 32, 713 క్యూసెక్కులు నీరు చేరుతుండగా, ఔట్‌ఫ్లో 13,619 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

మరిన్ని వార్తలు