బెల్టుషాపులను రద్దుచేయకుంటే 10 నుంచి ఉద్యమం

28 Sep, 2015 13:41 IST|Sakshi

బెల్టుషాపులను ప్రోత్సహించి కుటుంబాల్లో చిచ్చు రేపుతున్నారని ఏపీ సర్కారుపై వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. ప్రమాణ స్వీకారం చేసినప్పటి తొలి సంతకానికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విలువ ఇవ్వడం లేదని ఆయన అన్నారు. ఎక్సైజ్ శాఖ డిప్యూటి కమిషనర్ను కలిసి ఈ మేరకు ఒక వినతిపత్రం ఇచ్చారు.

బెల్టు షాపులను రద్దు చేయాలంటూ ఆయనకు విజ్ఞప్తి చేశారు. బెల్టు షాపుల నుంచి ఏపీలోని వివిధ మంత్రులు, ఎమ్మెల్యేలకు నెలకు 2 కోట్ల రూపాయల ముడుపులు అందుతున్నాయని అంబటి రాంబాబు ఆరోపించారు. బెల్టు షాపులను రద్దు చేయకపోతే వచ్చే నెల 10వ తేదీ నుంచి ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు.

మరిన్ని వార్తలు