రోడ్డు ప్రమాదంలో మహిళా అటెండర్‌ దుర్మరణం

19 Jul, 2017 22:31 IST|Sakshi

కదిరి అర్బన్‌ : రోడ్డు ప్రమాదంలో మహిళా అటెండర్‌ దుర్మరణం చెందింది. స్థానికులు తెలిపిన మేరకు... పట్నం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల అటెండర్‌ వెంకటరమణమ్మ (55) బుధవారం మధ్యాహ్నం బ్యాంకు పనినిమిత్తం కదిరికి వచ్చింది. స్థానిక బాలికల ఉన్నత పాఠశాల ముందు రోడ్డు దాటుతుండగా కదిరి నుంచి అనంతపురం వైపు వెళ్లే వ్యాను వేగంగా ఢీకొంది. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు ప్రభుత్వాస్పత్రికి తరలించేలోపే మృతి చెందింది. ఈమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ఉపాధ్యాయుల సంతాపం: అటెండర్‌ వెంకటరమణమ్మ మృతికి జిల్లాపరిషత్‌ ఉన్నతపాఠశాల హెచ్‌ఎం నాగరాజు, ఉపాధ్యాయులు సంతాపం తెలిపారు.

మరిన్ని వార్తలు