చెర్లోపాళెం దుర్ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

17 Oct, 2015 08:25 IST|Sakshi
చెర్లోపాళెం దుర్ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

హైదరాబాద్: ప్రకాశం జిల్లా కందుకూరు మండలం చెర్లోపాళెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే ప్రమాద స్థలి, ఆసుపత్రులకు వెళ్లి బాధితులకు సహాయం అందించాల్సిందిగా పార్టీ శ్రేణులను ఆదేశించారు. ఈ మేరకు ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సహా పార్టీ జిల్లా అధ్యక్షుడితో ఫోన్లో మాట్లాడారు. ప్రమాదంలో దుర్మరణం చెందినవారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కందుకూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారి ఆరోగ్య పరిస్థితిని నాయకుల ద్వారా తెలుసుకున్నారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ప్రకాశం జిల్లా పుట్లూరు మండలం చేవూరు నుంచి పెళ్లి బృందం డీసీఎంలో మాలకొండ వెళుతుండగా ఎదురుగా వచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఎక్కువ సమయం బస్సును నడపటం వల్ల డ్రైవర్ కునుకుపాటుకు లోనుకావడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 12 మంది మరణించగా, మరో15 మంది తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు