అక్రమ కేసులపై జనాగ్రహం

3 Mar, 2017 23:07 IST|Sakshi
అక్రమ కేసులపై జనాగ్రహం

టీడీపీ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధిచెబుతారు
తహసీల్దారు కార్యాలయాల ఎదుట వైఎస్సార్‌సీపీ నిరసనలు


నెల్లూరు(సెంట్రల్‌) : ప్రజల పక్షాన పోరాడుతున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై ప్రజలు ఆగ్రహించారు. ప్రజలు, బాదితుల పక్షాన నిలబడటం తప్పా.. అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రమాదానికి కారణమైన బస్సు యజమాన్యాన్ని రక్షిం చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నా లను ఎండగడుతున్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులపై కేసులు పెట్టి భయపెట్టాలని చూడటం హేయమైన చర్యగా అభివర్ణిస్తున్నారు. కృష్ణాజిల్లాలోని జాతీయరహదారిపై మంగళవారం దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, బాధితులను పరామర్శించి పూర్తి వివరాలు కావాలని అధికారులను, డాక్టర్‌లను అడిగినందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై తెలుగుదేశం ప్రభుత్వం ప్రోద్బలంతో అక్రమంగా కేసులు బనాయించినందుకు నిరసనగా గురువారం జిల్లా వ్యాప్తంగా తహసీల్దారు కార్యాలయాల ఎదుట వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నల్లబ్యాడ్జిలతో నిరసనలు తెలిపారు.

► సర్వేపల్లి నియోజక వర్గంలోని వెంకటాచలం మండల  తహసీల్దారు కార్యాలయం ఎదుట వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి నిరనస తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు నిరంకుశ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. ముత్తుకూరులోని తహసీల్దారు కార్యాలయం ఎదుట వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ మెట్టా విష్టువర్ధన్‌రెడ్డి , టీపీ గూడూరులో ప్రధాన కార్యదర్శి చిల్లకూరు సుధీర్‌రెడ్డి,  మనుబోలులో బీసీ విభాగం జిల్లా అ«ధ్యక్షుడు బాస్కర్‌గౌడ్, పొదలకూరులో ఎంపీపీ బ్రహ్మయ్య ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
► వెంకటగిరిలోని  తహసీల్దారు కార్యాలయం ఎదుట జెడ్పీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ ప్రజల పక్షాన పోరాడుతున్నందుకు జగన్‌మోహన్‌రెడ్డిపై కేసులు పెట్టడం సిగ్గుచేటన్నారు. కాగా, సైదాపురం మండలంలోని తహసీల్దారు కార్యాలయం ఎదుట మండల కన్వీనర్‌ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు.
► కావలి నియోజకవర్గంలోని  దగదర్తిలో మండల తహసీల్దారు కార్యాలయం ఎదుట జరిగిన నిరసనలలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. కేసులతో ఎవరూ భయపడరని.. టీడీపీ చేసే అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో తగిన బుద్ధి చెబుతారన్నారు. కావలిలోని తహసీల్దారు కార్యాలయం ఎదుట నగర అ«ధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి, ప్లోర్‌లీడర్‌ కనుమర్లపూడి వెంకటనారాయణ.. బోగోలులో మండల కన్వీనర్‌ రఘుయాదవ్‌ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
► ఉదయగిరి తహసీల్దారు కార్యాలయం ఎదుట జరిగిన నిరసనలో మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం పోరాడుతున్న జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ ప్రభుత్వం కేసులు పెట్టడం అన్యాయంగా ఉందన్నారు. వింజమూరులో మండల కన్వీనర్‌ మలిరెడ్డి విజయకుమార్‌రెడ్డి, జిల్లా స్టీరింగ్‌ కమిటీ సభ్యులు బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు.
► గూడూరు నియోజక వర్గంలోని తహసీల్దారు కార్యాలయం ఎదుట నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళి ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు. వాకాడులో సీజీసీ సభ్యులు నేదురుమల్లి పద్మనాభరెడ్డి ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు.
► సూళ్లూరుపేట నియోజక వర్గంలోని నాయుడుపేట  తహసీల్దారు కార్యాలయం ఎదుట మండల కన్వీనర్‌ తంబిరెడ్డి ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. సుబ్రమణ్యంరెడ్డి, రఫి పాల్గొన్నారు.
► ఆత్మకూరులోని తహసీల్దారు కార్యాలయం ఎదుట జరిగిన నిరసనలో  మున్సిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ అల్లారెడ్డి ఆనందరెడ్డి, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు కొండా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. సంగంలో జరిగిన కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కంటాబత్తిన రఘునాథరెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు