ఉప్పు కలపడం వల్ల కలిగే ఉపయోగం?

19 Dec, 2014 23:53 IST|Sakshi
ఉప్పు కలపడం వల్ల కలిగే ఉపయోగం?

 అధిక పరమాణు పరిమాణం, అత్యల్ప అయనీకరణశక్తి వల్ల క్షార లోహాలు అత్యంత చురుకైనవి. అంటే వీటి చర్యాశీలత ఎక్కువ. పొడిగాలిలో ఉంచినప్పుడు గాలిలోని ఆక్సిజన్‌తో చర్య జరిపి వాటి ఆక్సైడ్ పొరలను ఏర్పరుస్తాయి. ఈ కారణంగా ఇవి కాంతి విహీనమవుతాయి. ఈ ఆక్సైడ్‌లు మళ్లీ గాలిలోని తేమతో కలిసి హైడ్రాక్సైడ్‌లుగా ఏర్పడతాయి. చివరగా ఇవి గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్‌తో చర్యనొంది కార్బొనేట్లుగా మారతాయి. అందుకే వెండిలా తళతళా మెరిసే చిన్న సోడియం లోహ ముక్కను గాలికి వదిలేస్తే కొన్ని రోజుల తర్వాత తెల్లని పొడి సోడియం కార్బొనేట్‌గా మారుతుంది.
 
 క్షార లోహాలు
 లిథియం(ఔజీ), సోడియం (ూ్చ), పొటాషియం (K), రుబీడియం (Rb), సీసియం (Cs), ఫ్రా న్షియం (Fr) అనే ఆరు మూలకాలు S– బ్లాకులోని మొదటి గ్రూపులో ఉంటాయి. ఇవి నీటితో చర్య జరిపి బలమైన క్షారధర్మాలు ఉన్న హైడ్రాక్సైడ్‌లను ఏర్పరుస్తాయి. అందువల్ల వీటిని ‘క్షార లోహాలు’ అంటారు. లోహబంధంలో ఇవి వేలన్సీ కర్పరంలోని ఒకే ఒక ఎలక్ట్రాన్‌ను ఉపయోగించుకుంటాయి. అందువల్ల ఇవి మెత్తని లోహాలు. వీటిలో సోడియం, పొటాషియం మూలకాలు ప్రకృతిలో సమృద్ధిగా లభిస్తాయి. చివరిదైన ఫ్రాన్షియం రేడియోధార్మికత కలిగిన మూలకం. ఈ గ్రూపులోని మొదటి మూలకమైన లిథియానికి, దీని తర్వాతి గ్రూపులోని రెండో మూలకమైన మెగ్నీషియం ధర్మాలతో సారూప్యం ఉంటుంది. దీన్నే ‘కర్ణ సంబంధం’ అంటారు.
 
 -    జ్వాలా వర్ణపరీక్షలో క్షార లోహాలు విలక్షణమైన రంగులనిస్తాయి.
 -    క్షార లోహాల చర్యాశీలత గ్రూపులో పై నుంచి కిందికి పెరుగుతుంది.
 -    సోడియం.. స్వల్ప మోతాదులో ఆక్సిజన్‌ను అందజేస్తే మోనాక్సైడ్‌ను, అధిక ఆక్సిజన్‌ను అందిస్తే పెరాక్సైడ్‌ను ఇస్తుంది. సోడియం పెరాక్సైడ్ విఘటనం చెంది, తిరిగి ఆక్సిజన్‌ను ఇస్తుంది.
 -    క్షార లోహాలు నీటితో ఉధృతంగా చర్య జరుపుతాయి. ఈ చర్యలో హైడ్రాక్సైడ్ (క్షారం) లను ఏర్పరుస్తూ, హైడ్రోజన్‌ను విడుదల చేస్తాయి. ద్రావణం ఎరుపు లిట్మస్‌ను నీలి రంగులోకి మారుస్తుంది. ఈ చర్యలో విడుదలయ్యే ఉష్ణం కారణంగా హైడ్రోజన్ మండుతుంది.
 -    క్షార లోహాలు గాలితో, నీటితో అత్యధిక చర్యాశీలత చూపిస్తాయి. కాబట్టి సాధారణంగా వీటిని కిరోసిన్‌లో నిల్వ చేస్తారు. లిథియం సాంద్రత అత్యల్పంగా ఉండటం వల్ల కిరోసిన్‌పై తేలుతుంది. అందువల్ల దీన్ని పారాఫిన్ నూనెలో నిల్వ చేస్తారు.
 -    లిథియం మాత్రమే గాలిలోని నైట్రోజన్‌తో ప్రత్యక్ష చర్య జరిపి లిథియం నైట్రైడ్‌ను ఏర్పరుస్తుంది.
 
 ఉపయోగాలు:
 -    లిథియంను లెడ్‌తో కలిపి ‘వైట్ మెటల్’ అనే మిశ్రలోహాన్ని ఏర్పరుస్తారు. దీన్ని మోటారు ఇంజన్లలో ఉపయోగించే బేరింగ్‌ల తయారీలో వాడతారు.
 -    లిథియాన్ని అల్యూమినియంతో కలిపి విమాన భాగాల తయారీకి, మెగ్నీషియం లోహంతో కలిపి కవచాల తయారీకి ఉపయోగిస్తారు. లిథియంను ఉష్ణకేంద్రక చర్యల్లో వాడతారు.
 -    గతంలో పెట్రోల్ విస్ఫోటక వ్యతికరణి (Anti-knocking agent)గా వాడే టెట్రా ఇథైల్ లెడ్ (TEL) తయారీలో సోడియం/ లెడ్ మిశ్ర లోహాన్ని ఉపయోగించేవారు. వాతావరణంలోకి లెడ్ ఎక్కువగా విడుదల కావడం వల్ల ప్రస్తుతం వాహనాల్లో లెడ్ లేని పెట్రోల్‌ను వినియోగిస్తున్నారు.
 -    ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లలో ద్రవ సోడియాన్ని శీతలీకరణిగా వాడతారు.
 -    పొటాషియం అయాన్‌లు రక్తపోటు (బీపీ) ను అదుపులో ఉంచుతాయి. సోడియం అయాన్‌లు రక్తపోటును పెంచుతాయి.
 -    NPఓ మిశ్రమ ఎరువుల్లో పొటాషియం ఉంటుంది. పొటాషియం క్లోరైడ్ లేదా పొటాషియం నైట్రేట్ ఎరువుగా ఉపయోగపడుతుంది.
 -    సీసియంను కాంతి విద్యుత్ ఘటాల నిర్మాణాల్లో వాడతారు.
 
 సోడియం ముఖ్యమైన సమ్మేళనాలు:
 -    సోడియం క్లోరైడ్ (NaCl), సోడియం హైడ్రాక్సైడ్ (NaOH), సోడియం కార్బొనేట్ (Na2CO3), సోడియం బైకార్బొనేట్ (NaHCO3)లు సోడియం ముఖ్యమైన సమ్మేళనాలు. వీటికి పారిశ్రామికంగా ప్రాధాన్యం ఉంది.
 -    సాధారణ ఉప్పు (సోడియం క్లోరైడ్)కు ప్రధాన వనరు సముద్ర జలం. దీన్ని సముద్ర జలాన్ని భాష్పీభవనం చెందించి రూపొందిస్తారు.
 -    కాస్టిక్ సోడా (సోడియం హైడ్రాక్సైడ్)ను కాగితం, కృత్రిమ సిల్కు తయారీలో; కొవ్వులు, నూనెలను జలవిశ్లేషణ (సపోనిఫికేషన్) చేసి సబ్బులు తయారు చేయడానికి; బాక్సైట్, పెట్రోలియాన్ని శుద్ధి చేయడానికి ఉపయోగిస్తారు.
     సోడియం కార్బొనేట్ డెకా హైడ్రేట్ (Na2CO3.10H2O) ను ‘వాషింగ్ సోడా’ అంటారు. దీన్ని 1000ఇ (373ఓ)కు వేడిచేస్తే అనార్ధ్ర సోడియం కార్బొనేట్
     (Na2CO3)V> మారుతుంది. దీన్ని ‘సోడాయాష్’ అంటారు.
 -    వాషింగ్ షోడాను కఠిన జలం నుంచి మృదుజలాన్ని తయారు చేయడానికి; లాండ్రీలలో; గాజు, సబ్బు, బోరాక్స్ తయారీలో; కాగితం, రంగులు, వస్త్ర పరిశ్రమల్లో ఉపయోగిస్తారు.
 -    సోడియం బై కార్బొనేట్ లేదా సోడియం హైడ్రోజన్ కార్బొనేట్ (NaHCO3)ను ‘బేకింగ్ సోడా’ అంటారు. దీన్ని వేడిచేస్తే విఘటనం చెంది CO2 బుడగలు వస్తాయి. ఈ బుడగలు కేక్‌లు, పేస్ట్రీలలో రంధ్రాలను ఏర్పరుస్తాయి. ఇది మృదుల యాంటీసెప్టిక్‌గానూ పనిచేస్తుంది.
   
 లోహం        రంగు
 లిథియం    కెంపు రంగు
 సోడియం పసుపు రంగు
 పొటాషియం ఊదా రంగు
 రుబీడియం ఎరుపు రంగు
 సీసియం    నీలం రంగు
 
 
 1.    కిరోసిన్‌లో నిల్వ చేసే లోహం ఏది?
     1) సోడియం    2) జింక్
     3) ఐరన్    4) బెరీలియం
 2.    బేకింగ్ పౌడర్‌లో ఉండేది ఏది?
     1) Na2CO3    2) Na2SO4     3) NaHCO3-    4) K2CO3
 3.    మెగ్నీషియం ధర్మాలతో లిథియం సారూప్యాన్ని కలిగి ఉండటాన్ని ఏమంటారు?
     1) ద్రోణ సంబంధం  2) కర్ణ సంబంధం
     3) గ్రూపు సంబంధం 4) రసాయన బంధం
 4.    పొటాషియంను ఏ ద్రవంలో నిల్వచేస్తారు?
     1) నీరు    2) ఆల్కహాల్
     3) కిరోసిన్    4) ద్రవ NH3
 5.    Na2CO3 జలద్రావణం ద్వారా CO2 ను పంపిస్తే ఏర్పడేది?
     1)HCl                2) NaCl
     3) NaHCO3    4) NaOH
 6.    నీటిలో అత్యధిక చర్యాశీలత కలిగి ఉండేది?
     1) Na     2) K    3) Cs    4) Li
 7.    బెంగాల్ సాల్ట్‌పీటర్ అని దేనికి పేరు?
     1) KCl    2) KNO3
     3) NaCl    4) NaNO3
 8.    చిలీ సాల్ట్ పీటర్ రసాయన ఫార్మూలా?
     1) NaCl    2) NaNO3
     3) Na2SO4-    4) Na2CO3
 9.    ఉదరంలోని ఆమ్లత్వాన్ని తగ్గించడానికి ఉపయోగపడేది?
     1) కాస్టిక్ సోడా    2) సోడాయాష్
     3) వాషింగ్ సోడా    4) బేకింగ్ సోడా
 10.    అతి తేలికైన లోహం ఏది?
     1) లిథియం    2) సోడియం
     3) పొటాషియం    4) సీసియం
 11.    కిందివాటిలో ఏది క్షార లోహం కాదు?
     1) మెగ్నీషియం    2) సీసియం
     3) ఫ్రాన్షియం    4) లిథియం
 12.    నీటి శాశ్వత కాఠిన్యాన్ని తొలగించడానికి ఉపయోగించే పద్ధతి కానిది?
     1) సోడియం కార్బొనేట్ కలపడం
     2) స్వేదనం చేయడం
     3) సోడియం క్లోరైడ్ కలపడం
     4) మెంబ్రేన్ ద్వారా పంపడం
 13.    ఆహారంలో ఉప్పు కలపడం వల్ల కలిగే ఉపయోగం?
     1) వాసన, రుచి కలిగిస్తుంది
     2)    ఉదరంలో ఆహారం జీర్ణం కావడానికి అవసరమైన హైడ్రోక్లోరికామ్లాన్ని తక్కువ పరిమాణంలో ఉత్పత్తి చేస్తుంది
     3)    కూరగాయలపై ఉండే పురుగు మందులు ఆహారంలో కలవకుండా నిరోధిస్తుంది
     4)    వంట త్వరగా పూర్తి కావడానికి తోడ్పడుతుంది
 14.    జ్వాలా వర్ణ పరీక్షలో కెంపు రంగును ఇచ్చే లోహం ఏది?
     1) సోడియం    2) సీసియం
     3) కాల్షియం    4) లిథియం
 15.    మానసిక వ్యాధులను నయం చేయడానికి ఉపయోగించే లిథియం సమ్మేళనం ఏది?
     1) లిథియం క్లోరైడ్
     2) లిథియం కార్బొనేట్
     3) లిథియం సల్ఫేట్
     4) లిథియం బైకార్బొనేట్
 16.    ఫొటోగ్రఫీలో ఉపయోగించే హైపో రసాయన నామం?
     1) సోడియం బైకార్బొనేట్
     2) సోడియం సల్ఫేట్
     3) సోడియం కార్బొనేట్
     4) సోడియం థయోసల్ఫేట్
 17.    తినేసోడా రసాయనిక ఫార్మూలా?
     1) Na2CO3    2) Na2CO3. 10H2O
     3) NaCl        4) NaHCO3
 18.    వాషింగ్ సోడా ఫార్మూలా?
     1) Na2CO3. 10H2O
     2) అనార్ధ్ర  Na2CO3
     3) Na2SO4. 10H2O
     4) NaHCO3
 19.    మట్టి వస్తువులకు మెరుగు పెట్టడానికి దేన్ని వాడతారు?
     1) సోడియం కార్బొనేట్
     2) సోడియం క్లోరైడ్
     3) హైపో    4) బేకింగ్ సోడా
 20.    కిందివాటిలో సరికాని జత?
     1) చాకలి సోడా - సోడియం కార్బొనేట్
     2) సాధారణ లవణం - సోడియం క్లోరైడ్
     3)    బేకింగ్ సోడా-సోడియం థయోసల్ఫేట్
     4) కాస్టిక్ సోడా - సోడియం హైడ్రాక్సైడ్
 21.    కాస్టిక్ పొటాష్ ఫార్మూలా?
     1) KOH    2) KCl
     3) NaOH    4) K2CO3
 22.    నూనెలను సపోనిఫికేషన్ చేయడానికి సాధారణంగా ఏ పదార్థాన్ని వాడతారు?
     1) NaCl    2) Na2CO3
     3) NaHCO3    4) NaOH
 23.    శరీరంలోని సున్నిత ప్రాంతాలను శుభ్రం చేసుకోవడానికి వాడే మృదుల యాంటీసెప్టిక్ ఏది?
     1) Na2CO3    2) NaHCO3
     3) NaCl     4) Na2SO4
 
 సమాధానాలు
     1) 1;    2) 3;    3) 2;    4) 3;
     5) 3;    6) 3;    7) 2;    8) 2;
     9) 4;    10) 1;    11) 1;    12) 3;
     13) 2;    14) 4;    15) 2;    16) 4;
     17) 4;    18) 1;    19) 2;    20) 3;
     21) 1;    22) 4;    23) 2.
 

మరిన్ని వార్తలు