ఇక ధన జాతర

29 Mar, 2014 00:41 IST|Sakshi
ఇక ధన జాతర

సాక్షి, రాజమండ్రి : జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న చోట్ల ఎక్కడ చూసినా డబ్బు కట్టలు తెగిపడుతున్నాయి. పెరపెరలాడే కరెన్సీ నోట్లు ఓటర్ల చేతికి అందుతున్నాయి. ఓపక్క ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి డబ్బు ప్రవాహాన్ని అడ్డుకుంటున్నామని అధికారులు చెబుతున్నా.. ‘దొడ్డిదారుల’గుండా రూ.కోట్ల నోట్ల కట్టలు తరలివస్తున్నాయి. ‘కనిపించని సరుకు’ను కొనుగోలు చేసేందుకు విడివడి వడివడిగా ఓటర్లను చేరుతున్నాయి.
 
జిల్లాలో రాజమండ్రి నగరపాలక సంస్థతో పాటు ఏడు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. వీటి పరిధిలో 5,47,649 మంది ఓటర్లు ఉండగా, రూ.20 కోట్లకు పైగా పంపిణీ కానున్నట్టు అంచనా. కాగా శుక్రవారం రాత్రికే రూ.10 కోట్లకు పైగా వార్డుల్లో పంపిణీ అయినట్టు సమాచారం.
 
వార్డుల్లో అభ్యర్థులు పోటీ పడి మరీ డబ్బు పంపిణీ చేస్తున్నారు. ఓటుకు రూ.500 నుంచి రూ.వెయ్యి వరకూ చెల్లిస్తున్నారు. రాజమండ్రిలో ఇండిపెండెంట్లు కూడా రూ.వెయ్యి చెల్లించేందుకు వెనుకాడడం లేదు. కాగా కొన్ని మున్సిపాలిటీల్లో డబ్బు పంపిణీలో ముమ్మరపోటీ నెలకొనడంతో అక్కడి ఓటర్ల పంట పండుతోంది.
 
మండపేట ప్రాంతంలో కొందరు అభ్యర్థులు ప్రత్యర్ధులతో పోటీ పడి మరీ డబ్బు పంపకం చేశారని తెలిసింది. ఒక అభ్యర్థి రూ.2 వేలు చెల్లిస్తే పోటీగా మరో అభ్యర్థి రూ.3 వేలు చెల్లించారని సమాచారం. దీనిని సవాలుగా భావించిన మొదటి అభ్యర్థి మళ్లీ ఇంటింటికీ తిరిగి మరో రూ.2 వేలు పంపిణీ చేసినట్టు తెలిసింది.
 
 నేటి రాత్రి కీలకం..

మున్సిపాలిటీల్లో అభ్యర్థులు ఓటుకు డబ్బును ఆశించేవారిపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. తమకు ఓటేస్తారని ఎంతోకొంత నమ్మకం ఉన్న ఓటర్లకు రూ.500 మాత్రమే చేతిలో పెడుతున్నా.. అలాంటి నమ్మకం లేనిచోట.. ఓటర్లను ఎలాగై నా తమవైపు తిప్పుకోవాలని రూ.వెయ్యి నుం చి రూ.2 వేల వరకూ ముట్టజెపుతున్నారు. ప లువురు అభ్యర్థులు తమ ప్రత్యర్థి ఓటుకు ఎంత రేటు కట్టేదీ తెలుసుకుని.. దానికి కొంచెం జో డించి పంచాలని చూస్తున్నారు.దీంతో వారు పంచితే పంచాలని వీరూ, వీరు మొదలు పెడితే తామూ శ్రీకారం చుట్టాలని వారూ ఎదురు చూ స్తున్నారు. శనివారం రాత్రి మరో రూ.10 కోట్ల కు పైగా పంపిణీ జరిగే అవకాశాలున్నాయి.
 
చివరి రోజు ముమ్మర ప్రచారం
మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి శుక్రవారంతో తెర పడింది. సాయంత్రం ఐదు గంటలకు మైకులు మూగబోయాయి. ప్రచార కార్యాల యాలు బోసిపోయాయి. చివరి రోజు అభ్యర్థు లు ముమ్మర ప్రచారం సాగించారు. డప్పు వా యిద్యాలు, నృత్యాలతో, నినాదాలతో పట్టణ వీధులను హోరెత్తించారు. ఎన్నికల కోడ్‌ను అధికారులు కచ్చితంగా అమలు చేస్తుండడంతో సాయంత్రానికి ప్రచారం సద్దుమణిగింది.
 
రేపే పోలింగ్..

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ జరుగుతుంది. జిల్లాలో మొత్తం 5,47,649 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 1,69,971 మంది పురుషులు కాగా, 2,77,674 మంది మ హిళలు. మొత్తం 314 వార్డులకు 305 చోట్ల ఎన్నికలు జరుగుతుండగా 493 పోలింగ్ కేం ద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ విధుల్లో 2,941 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. వీరు కాక మరో వంద మంది వరకూ పోలింగ్ సరళిని పర్యవే క్షిస్తారు.

మరిన్ని వార్తలు