Israel-Hamas war: ‘షెకెల్‌’ కోసం సెంట్రల్‌ బ్యాంకు  కీలక నిర్ణయం

9 Oct, 2023 12:57 IST|Sakshi

Israel-Hamas war: ఇజ్రాయెల్‌, గాజా  మధ్య నెలకొన్న యుద్ధం, సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ ఇజ్రాయెల్ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. బహిరంగ మార్కెట్లో గరిష్టంగా 30 బిలియన్‌ డాలర్ల విదేశీ కరెన్సీని విక్రయించే ప్రణాళికలను (సోమవారం, అక్టోబర్ 9) ప్రకటించింది. దీంతో ఆ దేశ కరెన్సీ షెకెల్  భారీ నష్టాలనుంచి  కోలుకుంది.

గాజాలో పాలస్తీనా తీవ్రవాదులతో ఇజ్రాయెల్ పోరు నేపథ్యంలో ఆర్థిక పరిస్థితిని స్థిరీకరించే లక్ష్యంతో సెంట్రల్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుందని రాయిటర్స్‌ రిపోర్ట్‌ చేసింది. SWAP మెకానిజమ్‌ ద్వారా లిక్విడిటీని అందించేలా కృషి చేయనుంది. అలాగే మారకపు రేటులో అస్థిరత, మార్కెట్ల సాఫీగా కార్యకలాపాలకు అవసరమైన ద్రవ్యతను నిర్ధారించడానికి రాబోయే కాలంలో మార్కెట్లో జోక్యం చేసుకుంటామని తాజాగా విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.   (స్పోర్ట్స్‌ ఈవెంట్‌లో మెరిసిన రణబీర్‌, అలియా...మరో విశేషమేమంటే..!)

కరెన్సీ కష్టాలు
ప్రకటనకు ముందు, షెకెల్ 2 శాతానికి పైగా క్షీణించింది. డాలర్‌ మారకంలో  3.92 వద్ద 7-1/2 సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరుకుంది. ఇప్పటికే బలహీనంగా ఉన్న షెకెల్‌  2023లో యునైటెడ్ స్టేట్స్ కరెన్సీకి వ్యతిరేకంగా 10 శాతం క్షీణతను నమోదు చేసింది. ఈ క్షీణతకు ప్రధానంగా ప్రభుత్వ న్యాయపరమైన సమగ్ర ప్రణాళిక కారణంగా చెబుతున్నారు. ఇది విదేశీ పెట్టుబడులను గణనీయంగా పరిమితం చేసిందని రాయిటర్స్ తెలిపింది. (హీరో మోటో ఎండీ, తదితరులపై ఫోర్జరీ కేసు:షేరు ఢమాల్‌)

వ్యూహాత్మక ఎత్తుగడలు
ముఖ్యంగా దేశంలోని టెక్ రంగానికి విదేశీ ప్రవాహాల పెరుగుదల మధ్య.200 బిలియన్  డాలర్లకు మించిన ఫారెక్స్ నిల్వలు పేరుకుపోవడంతో, ఇజ్రాయెల్ 2008 నుండి ఫారెక్స్ కొనుగోళ్ల ద్వారా గణనీయమైన మొత్తాన్ని సంపాదించింది. ఎగుమతిదారులను రక్షించేలా ఈ ప్రణాలికలని బ్యాంక్ ఆఫ్ ఇజ్రాయెల్ గవర్నర్ అమీర్ యారోన్ రాయిటర్స్‌కు తెలియజేసారు. 

కాగా  ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధంతో గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలు భగ్గుమంటున్నాయి.  ఇజ్రాయెల్ పై  హమాస్ మిలిటెంట్ల  మెరుపు దాడి, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు వరుస వైమానిక దాడులు అక్కడి ప్రజులకు అతలాకుతలం  చేస్తున్నాయి. 3వ రోజుకి ఈ  భీకర పోరులో  ఇప్పటికే ఇరువైపులా వేలాది మంది పౌరులు, ఉగ్రవాదులు చనిపోయిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు