నాకు ఓటేయొద్దు ప్లీజ్..: నరేంద్రనాథ్ దూబే

23 Apr, 2014 01:46 IST|Sakshi
నాకు ఓటేయొద్దు ప్లీజ్..: నరేంద్రనాథ్ దూబే

ఫలితాలెలా ఉన్నా, గెలవాలనే లక్ష్యంతోనే ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేస్తారు. నరేంద్రనాథ్ దూబే మాత్రం కాస్త వెరైటీ వ్యక్తి. ఎక్కువ ఎన్నికల్లో ఓడిపోవడం ద్వారా గిన్నిస్ రికార్డు సాధించాలనేది ఆయన లక్ష్యం. ఈ లక్ష్య సాధన కోసమే ఆయన 1984 నుంచి వరుసగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇప్పటి వరకు పొరపాటుగానైనా గెలిచిన పాపాన పోని నరేంద్రనాథ్, ఈసారి కూడా ఇదే ఒరవడి కొనసాగించాలనుకుంటున్నారు. తొలిసారిగా 1984లో వారణాసి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని చెరాల్‌గావ్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేశారు.
 
 ఆ తర్వాత మునిసిపాలిటీ స్థాయి నుంచి రాష్ట్రపతి ఎన్నికల వరకు పలు ఎన్నికల్లో పోటీచేసి, అప్రతిహతంగా పరాజయ పరంపరను కొనసాగించారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న వారణాసి లోక్‌సభ స్థానం నుంచి జనశక్తి ఏకతా పార్టీ అభ్యర్థిగా దూబే బరిలోకి దిగారు. గిన్నిస్ రికార్డు సాధించడమే తన ఏకైక లక్ష్యమని, ఈసారి కూడా ఎప్పటి మాదిరిగానే ఓడి తీరుతానని ఈ ఓటువీరుడు ధీమాగా చెబుతున్నారు.

>
మరిన్ని వార్తలు