‘దానం’పై కేసుల్లో చార్జిషీట్లు వేయండి | Sakshi
Sakshi News home page

‘దానం’పై కేసుల్లో చార్జిషీట్లు వేయండి

Published Wed, Apr 23 2014 12:51 AM

charge sheet file to  danam nagendhar case

పోలీసులకు హైకోర్టు ఆదేశం

 హైదరాబాద్: మాజీ మంత్రి దానం నాగేందర్‌పై నమోదైన కేసుల్లో దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్లు దాఖలు చేయాలని హైకోర్టు మంగళవారం బంజారాహిల్స్ పోలీసులను ఆదేశించింది. ఇదే సమయంలో దానంపై కేసుల్లో పోలీసులు దర్యాప్తు సక్రమంగా చేయట్లేదంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణను ముగిస్తున్నట్లు ప్రకటించింది.

ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు ఉత్తర్వులు జారీ చేశారు. దానంపై నమోదైన కేసుల దర్యాప్తులో పురోగతీ లేదని, ఈ కేసులో దర్యాప్తును కోర్టు పర్యవేక్షించాలని న్యాయవాది ఎ.తిరుపతివర్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement