‘పుర’పోరు.. ఇక హోరు

19 Mar, 2014 03:46 IST|Sakshi
‘పుర’పోరు.. ఇక హోరు

 ఏలూరు, న్యూస్‌లైన్ : మునిసిపల్ ఎన్నికల్లో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఏలూరు నగరపాలక సంస్థలో 50 డివి జన్లు, ఏడు మున్సిసిపాలిటీలు, ఒక నగర పంచాయతీలో పరిధిలోని 241 వార్డులకు మొత్తం 940మంది అభ్యర్థులు బరిలో మిగి లారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున 281 మంది, టీడీపీ నుంచి 280 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
 
  కాంగ్రెస్ పార్టీ తరఫున కేవలం 47 మంది మాత్రమే పోటీకి నిలవడం విశేషం. అభ్యర్థులు దొరక్కపోవడంతో అధికార పార్టీ నామినేషన్ల దశలోనే చతికిలపడిం ది. బీజేపీ 23, సీపీఎం 13, సీపీఐ నాలుగు వార్డుల్లో అభ్యర్థులను బరిలోకి దింపారుు.
 
 291 వార్డులు/డివిజన్‌లకు కలిపి మొత్తం 1,980 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్లు ఉపసంహరణ చివరి రోజు మంగళవా రం సాయంత్రం నాటికి 1,026 మంది పోటీనుంచి నిష్ర్కమించారు. అతి స్వల్పంగా అభ్యర్ధులు స్క్రూటినీలో అనర్హతకు గురయ్యారు.
 
 ఏకగ్రీవ కౌన్సిలర్లు నలుగురు
 నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం అనంతరం టీడీపీ నుంచి ముగ్గురు, ఇండిపెండెం టు ఒకరు కౌన్సిలర్లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రత్యర్థులు అనర్హతకు గురికావటం, పోటీ నుంచి తప్పుకోవటంతో ఆ నలుగురు విజేతలుగా నిలిచారు. నిడదవోలులోని 13 వార్డు అభ్యర్థి తీపర్తి ప్రసన్న, 19 వార్డు అభ్యర్థి మారిశెట్టి పద్మజ, పాలకొల్లు 14వ వార్డు నుంచి మల్లంపల్లి ఫకీర్‌బాబు, తాడేపల్లిగూడెం నుంచి 16వ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్ధి పెండ్యాల చంద్రశేఖరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యూరు.
 
 
 వైఎస్సార్ సీపీ, టీడీపీ మధ్యే పోటీ
 తాజా అంకెలతో పుర పోరులో పోటీ వైఎస్సా ర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం మధ్యేనని తేలి పోయింది. ఏలూరు నగరపాలకసంస్థ, 7 మునిసిపాలిటీలు, ఒక నగర పంచాయతీలో ఈ రెండు పార్టీలే ప్రత్యర్థులుగా ఉన్నాయి.
 
 తణుకు, కొవ్వూరు, నరసాపురం, పాలకొల్లు పట్టణాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకే ఒక్కరు బరిలో నిలవడం విశేషం. ఏకగ్రీవాలు పోగా మిగిలిన 287 వార్డులకు ఈ నెల 30న పోలింగ్ జరగనుంది.
 
 ఏలూరు బరిలో 174 మంది
 ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో 50 డివిజన్లు ఉన్నాయి. వైఎస్సార్ సీపీ,  టీడీపీల నుంచి 50మంది చొప్పున పోరుకు సిద్ధం అయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 13మంది, బీజేపీ నుంచి ఐదుగురు, స్వతంత్రులు 61మంది బరిలో నిలిచారు.
 
 మిగిలిన చోట్ల ఇలా...
  తాడేపల్లిగూడెం మునిసిపాలిటీలో 34వార్డులకు 124మంది బరిలో మిగి లారు. వైఎస్సార్ సీపీ నుంచి  33 మంది, టీడీపీ నుంచి 33మంది, సీపీఎం నుంచి ఒకరు, బీజేపీ నుంచి ఆరుగురు,  కాంగ్రెస్ నుంచి నలుగురు, స్వతంత్రులు 48మంది పోటీలో ఉన్నారు.
 
 
  తణుకు మునిసిపాలిటీలో 34వార్డుల్లో 97మంది పోరుకు సై అంటున్నా రు. వైఎస్సార్ సీపీ 32చోట్ల బరిలో నిల వగా, రెండుచోట్ల సీపీఎంకు మద్దతు ఇస్తోంది. టీడీపీ 32చోట్ల, సీపీఐ-1, కాంగ్రెస్-1, బీజేపీ-5, బీఎస్‌పీ-3, స్వ తంత్రులు 21చోట్ల పోటీ చేస్తున్నారు.
 
  నిడదవోలు మునిసిపాలిటీలో 28 వార్డులకు 91మంది పోరుకు సిద్ధపడ్డారు. వైఎస్సార్ సీపీ నుంచి 26మంది తలపడుతున్నారు. టీడీపీ రెండు వార్డులను ఏకగ్రీవంగా గెలుచుకోగా, 26వార్డుల్లో పోటీలో ఉంది.
 
 కాంగ్రెస్-15, బీజేపీ-5, బీఎస్‌పీ-3, లోక్‌సత్తా-1, సీపీఎం-3, ఇతరులు 13మంది పోటీలో ఉన్నారు.  కొవ్వూరు మునిసిపాలిటీలో 23 వార్డులు ఉండగా 80 మంది రంగంలో మిగిలారు. వైఎస్సార్ సీపీ నుంచి 26 మంది, టీడీపీ నుంచి 25, కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం నుంచి ఒక్కొక్కరు బరిలో ఉన్నారు. స్వతంత్రులు 26మంది పోటీ చేస్తున్నారు.
  నరసాపురం మునిసిపాలిటీలో 31వార్డులకు 107మంది బరిలో ఉన్నా రు. వైఎస్సార్ సీపీ నుంచి 29 మంది బరిలో ఉన్నారు. రెండుచోట్ల సీపీఎంకు మద్దతు ఇస్తున్నారు. టీడీపీ నుంచి 29 మంది బరిలో ఉండగా, 3చోట్ల బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. కాంగ్రెస్-1, స్వ తంత్రులు 43చోట్ల పోటీచేస్తున్నారు.
 
  పాలకొల్లు మునిసిపాలిటీలో 31 వార్డులకు 86మంది బరిలో ఉన్నారు. ఇక్కడ ఓ వార్డును టీడీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. వైఎస్సార్ సీపీ-29, టీడీపీ-30, బీఎస్‌పీ-1, సీపీఐ-1, సీపీఎం-1, కాంగ్రెస్-1, స్వతంత్రులు 23చోట్ల పోటీలో ఉన్నారు.
 
  భీమవరం మునిసిపాలిటీలో 39 వార్డులుండగా 110మంది బరిలో ఉన్నారు. వైఎస్సార్ సీపీ నుంచి 37మంది పోటీలో ఉన్నారు. టీడీపీ నుంచి 36మంది, కాంగ్రెస్ నుంచి 11మంది, స్వతంత్రులు 22మంది బరిలో నిలిచారు. బీజేపీ 3చోట్ల, సీపీఎం ఒకచోట పోటీ చేస్తున్నారుు.
 
  జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ పరిధిలో 20వార్డులకు గాను 71 మంది బరిలో ఉన్నారు. వైఎస్సార్ సీపీ నుంచి 20మంది, టీడీపీ నుంచి 19మంది పోటీకి నిలిచారు. బీజేపీ, లోక్‌సత్తా, సీపీఐ ఒక్కొక్క వార్డులో పోటీ చేస్తుం డగా, సీపీఎం అభ్యర్థులు మూడుచోట్ల బరిలో ఉన్నారు. 26 మంది స్వతంత్రులు పోటీ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు