అయిదు చోట్ల ఒక్కొక్కరు | Sakshi
Sakshi News home page

అయిదు చోట్ల ఒక్కొక్కరు

Published Wed, Mar 19 2014 3:42 AM

For each of the five areas

సాక్షి ప్రతినిధి, కరీంనగర్ :  జిల్లా నుంచి ఢిల్లీ వరకు కసరత్తు జరిగే అధికార పార్టీ అభ్యర్థిత్వాల ఖరారు ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే జిల్లా కాంగ్రెస్ కమిటీ 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు తవు ప్రతిపాదనలను పంపించింది. రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ పర్యటన సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు కొండూరి రవీందర్‌రావు జాబితాను అందజేశారు. ఈ జాబితాను పరిశీలించి అభిప్రాయూలను తెలియుజేయూలని దిగ్విజయ్‌సింగ్ తెలంగాణ ఎన్నికల కమిటీకి అప్పగించినట్లు తెలిసింది.
 
 
 ఈనెల 22న సవూవేశం కానున్న ఎన్నికల కమిటీ సభ్యులు జాబితాపై చర్చించి పోటీ ఉన్న సెగ్మెంట్లలో వుుగ్గురి  చొప్పున పేర్లను అధిష్ఠానానికి సిఫారసు చేయునున్నారు. జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు వుుగ్గురితో పాటు వురో రెండు స్థానాలకు డీసీసీ అధ్యక్షుడు ఒక్కొక్కరి పేర్లనే సిఫారసు చేశారు.

వుంథనిలో వూజీ వుంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, వూనకొండూరు నుంచి ఆరెపల్లి మోహన్, హుస్నాబాద్ నుంచి అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి అభ్యర్థిత్వాలనే ప్రతిపాదించారు. జగిత్యాల నుంచి మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి, ధర్మపురి నుంచి రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పేర్లు మాత్రమే పంపించారు. సిరిసిల్ల : సిరిసిల్ల నియోజకవర్గం నుంచి డీసీసీ అధ్యక్షుడు కొండూరి రవీందర్‌రావు ఇతరుల పేర్లతో పాటు తన పేరును ప్రతిపాదించుకున్నారు. మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ గుడ్ల మంజుల, నాగుల సత్యనారాయణగౌడ్, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అజ్మతుల్లా పేర్లు సూచించారు.
 
 వేములవాడ : ఏఎంసీ చైర్మన్ ఏనుగు మనోహర్‌రెడ్డి, జెడ్పీ మాజీ వైస్‌చైర్మన్ తీగల రవీందర్ గౌడ్, ఏఎంసీ మాజీ చైర్మన్ అల్లాడి రమేష్
 కరీంనగర్ : గత ఎన్నికల్లో పోటీచేసిన చల్మెడ లక్ష్మీనర్సింహారావు, వేములవాడ దేవస్థానం చైర్మన్ బొమ్మ వెంకటేశ్వర్ లేదా ఆయన కుమారుడు బొమ్మ శ్రీరామ్
 చొప్పదండి : గునుగొండ బాబు (గత ఎన్నికల్లో పోటీ చేసినా, అయిదేళ్ల వ్యవధిలో ఈయున పుంజుకోలేకపోయూడని పేరుతో పాటు నివేదించారు). ఓయూ జేఏసీ నేత డాక్టర్ మేడిపల్లి సత్యం,  సీనియుర్ నాయుకుడు వెన్నెం రాజమల్లయ్య, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు అర్ష వుల్లేశం పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
 
 హుజూరాబాద్ : వూజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయుణగౌడ్ పేరును ఈసారి హుజూరాబాద్ నుంచి ప్రతిపాదించారు. ఆయునతో పాటు కాంట్రాక్టర్, పార్టీ సీనియుర్ నాయుకుడు కేతిరి సుదర్శన్‌రెడ్డి, జమ్మికుంట మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి, పీసీసీ కార్యదర్శి ప్యాట రమేష్, గత ఎన్నికల్లో పోటీచేసిన వకుళాభరణం కృష్ణమోహన్‌రావు పేర్లను ప్రతిపాదించారు.
 
 పెద్దపల్లి : మాజీ ఎమ్మెల్యేలు బిరుదు రాజమల్లు, గీట్ల ముకుందరెడ్డి, ఎమ్మెల్సీ టి.భానుప్రసాద్‌రావు, సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు అంతటి అన్నయ్యగౌడ్ పేర్లున్నాయి.
 రామగుండం : గత ఎన్నికల్లో పోటీచేసిన బాబర్ సలీంపాషా, పీసీసీ ప్రొటోకాల్ ఛైర్మన్ హర్కర వేణుగోపాల్, ఏఐసీసీ సభ్యుడు కోలేటి దామోదర్, కౌశిక హరికి జాబితాలో చోటు దక్కింది.
 కోరుట్ల : జువ్వాడి కృష్ణారావు లేదా జువ్వాడి నర్సింగరావు, డాక్టర్ జె.ఎన్.వెంకట్, కల్వకుంట్ల సుజిత్‌కువూర్ పేర్లను ఇక్కడినుంచి ప్రతిపాదించారు.
 
 ఈ జాబితాలో పేర్లు లేవంటూ ఇప్పటికే పలు సెగ్మెంట్లలో ఆశావాహులు అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. సిరిసిల్ల నుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్న కారంపురి రేఖ నియోజకవర్గ జాబితాలో తన పేరు లేదంటూ దిగ్విజయ్‌సింగ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. వేములవాడ నుంచి టికెట్ ఆశిస్తున్న జనగామ లింగారావు డీసీసీ జాబితాలో తన పేరు లేదంటూ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే పోటీ ఎక్కువగా ఉన్న పెద్దపల్లి బరిలో ఎన్‌ఆర్‌ఐ సురేశ్‌రెడ్డి తెరపైకి వచ్చారు. మాజీ ఎమ్మెల్యే గొట్టిముక్కుల రాజిరెడ్డి వారసుడుగా రంగంలోకి వచ్చిన సురేశ్‌రెడ్డి తనవంతు ప్రయుత్నాలు ప్రారంభించారు.
 

Advertisement
Advertisement