ముక్కుసూటిగా వెళుతున్నారా?

21 Jul, 2018 00:21 IST|Sakshi

సెల్ఫ్‌ చెక్‌

ముక్కుసూటిగా వెళ్లేవాడికి అన్నీ ఆటంకాలే ఎదురవుతాయి. లౌక్యం తెలుసుకుని అందరితో కలివిడిగా ఉంటే నలుగురు మెచ్చుతారు. అలా కాకుండా ‘ఎస్‌ నేనంటే నేనే’ అనుకుంటే ‘అబ్బ ఛ’ అని పక్కవారంటారు. నేను చెప్పిందే అందరూ వినాలంటే ‘అది జరగదులే’ అంటారు. ఈ ఆటిట్యూడ్‌ ఉన్నవారికి దాదాపుగా ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. మీరూ ముక్కుసూటిగా వెళుతున్నారా? లేక ఒక పని చేసేముందు ఆలోచిస్తారా? ఎప్పుడూ చిర్రుబుర్రులాడుతూ లేని తంటాలు తెచ్చుకుంటుంటారా? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి.

1. మీ ప్రవర్తన మార్చుకోమని తల్లిదండ్రులతో పాటు శ్రేయోభిలాషులు చెప్తుంటారు. ఆ సమయంలో సరే అని చెప్పినా తర్వాత మీ పంథా ఎప్పటిలానే ఉంటుంది.
    ఎ. అవును      బి. కాదు  

2. మీకు మీరే గొప్పతనాన్ని ఆపాదించుకుంటారు. 
    ఎ. అవును      బి. కాదు  

3. చిన్నతనం నుంచి ఎవరైనా పని చెప్తే మీకు నచ్చదు. సలహాలను పట్టించుకోరు. ముక్కుసూటిగా వెళ్లటం మీకు అలవాటు.
    ఎ. అవును      బి. కాదు  

4.    మీ సూటితనం వల్ల మీ పనులు ఎక్కడివక్కడే ఆగిపోతుంటాయి. దీనివల్ల అసహనం, కోపం మీ వెంటే ఉంటుంది. 
    ఎ. అవును      బి. కాదు
 
5.    వెనకా ముందు ఆలోచించకుండా మాట్లాడటం వల్ల మీరంటే ఎవరికీ ఇష్టం ఉండదు.
    ఎ. అవును      బి. కాదు
 
6.    మీ మాటలు, చేష్టలతో ఇతరులను నొప్పిస్తూ ఉంటారు. ఇతరుల భావాలను ఎప్పటికీ అర్థం చేసుకోలేరు.
    ఎ. అవును      బి. కాదు  

7.     బొత్తిగా మీకు లౌక్యం తెలియదు. దీనివల్ల మీ అభివృద్ధి ముందుకు జరగదు. ప్రమోషన్లు దాదాపు మీకు దూరంగా ఉంటాయి.
    ఎ. అవును      బి. కాదు  

8.     మీ ప్రవర్తన వల్ల మీ కుటుంబ సభ్యులు కూడ ఇబ్బందుల పాలవుతుంటారు. మీతో ప్రేమగా ఉండటానికి సంకోచిస్తుంటారు.
    ఎ. అవును      బి. కాదు

9.    మీ ఆటిట్యూడ్‌ వల్ల పొరుగువారితో, సహచరులతో, చివరికి ప్రయాణాలప్పుడు కూడ విభేదాలు, గొడవలు వస్తుంటాయి.
    ఎ. అవును      బి. కాదు  

10. ముక్కుసూటితనం వల్ల మీకు పరిచయాలు చాలా తక్కువగా ఉంటాయి. మిమ్ములను అర్థం చేసుకున్నవారే మీతో ఉంటారు. కొత్తవారు మీకు దాదాపు దగ్గర కారు.
    ఎ. అవును      బి. కాదు  

‘ఎ’ సమాధానాలు ఏడు దాటితే మీరు స్ట్రైట్‌ ఫార్వర్డ్‌గా వెళుతుంటారు. దీనివల్ల మీకు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. మీరు పెరిగిన వాతావణ పరిస్థితులు కూడా మీ ప్రవర్తనకు కారణం కావచ్చు. ముక్కుసూటితనం ఎప్పటì కైనా ప్రమాదమే. దీనివల్ల కొన్నిసార్లు మీ పక్కవారికి కూడ ప్రమాదం జరగవచ్చు. మీలో ఇలాంటి లక్షణాలుంటే వాటికి వెంటనే ఫుల్‌స్టాప్‌ పెట్టండి. పదిమందితో కలివిడిగా ఉండటం నేర్చుకోండి. మీకు ‘బి’ సమాధానాలు ‘ఎ’ కంటే ఎక్కువగా వస్తే మీలో స్ట్రెట్‌ఫార్వర్డ్‌ తత్వం లేనట్లే.
 

మరిన్ని వార్తలు