అస్త్ర తంత్ర : ఒంటరి ప్రయాణమా... జాగ్రత్త!

4 Dec, 2013 00:57 IST|Sakshi
అస్త్ర తంత్ర : ఒంటరి ప్రయాణమా... జాగ్రత్త!

 ఆఫీసు పని మీదో, వ్యక్తిగత పని మీదో... కొన్నిసార్లు ఒంటరిగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. వెళ్లేది బస్సులో అయినా, రైల్లో అయినా కానీ, జాగ్రత్త తీసుకోవడం తప్పనిసరి. అందుకు ఏం చేయాలంటే...

 

  వాహనంలో ఆడవాళ్లు ఎవరూ లేకపోతే, వీలైనంతవరకూ వేరేదానిలో వెళ్లేందుకు ప్రయత్నించడం మంచిది. లేదంటే కనీసం మెయిన్‌డోరుకు దగ్గరలో ఉన్న సీట్లో కూర్చోవడం ఉత్తమం!

 

  కొందరు కావాలని మాట్లాడేందుకు ప్రయత్నిస్తారు. అస్సలు మాట్లాకుండా ఉండనక్కర్లేదు. ఆచితూచి మాట్లాడండి. వ్యక్తిగత విషయాలు చెప్పొద్దు!

 

  నా ఫోన్ చార్జింగ్ అయిపోయింది, మీదోసారి ఇవ్వమని ఎవరైనా అడిగితే... నిర్మొహమాటంగా ‘నో’ అనండి. వాళ్లు మీ నంబర్ సేవ్ చేసుకుని తర్వాత విసిగించే ప్రమాదం ఉంది!

 

  ఎవరైనా ఏదైనా పెడితే తినవద్దు. వాళ్లు ఫీలవుతారు అనుకుంటే, అది మీరు తినకూడదనో, ఒంటికి పడదనో చెప్పి తప్పించుకోండి!

 

  రైలు కంపార్ట్‌మెంట్లో మీరొక్కరే ఆడవాళ్లయితే... బాగా పై బెర్తులోనే పడుకోండి. అలాగే టాయిలెట్‌కు వెళ్లినప్పుడు సెల్‌ఫోన్, ఏవైనా సేఫ్టీ వెపన్స్ ఉంటే వాటిని కూడా తప్పక తీసుకెళ్లండి!

 

  ఎవరైనా అనుమానాస్పదంగా అనిపించినా, మీమీద ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారనో లేక మిమ్మల్ని ఎక్కువగా పరిశీలిస్తున్నారనో అనుమానం వచ్చినా... రైలయితే కంపార్ట్‌మెంట్ మారండి. బస్సయితే సీటు మారండి. టీసీకో లేక బస్సు డ్రైవరుకో విషయం తప్పక చెప్పండి!

 

  వీలైనంతవరకూ నిద్రపోకుండా ఉండేందుకు ట్రై చేయండి. మరీ దూర ప్రయాణం అయితే ఎలాగూ తప్పదు కదా! అలాంటప్పుడు నిద్రపోయినా మరీ మొద్దు నిద్రపోవడం అంత మంచిది కాదని గుర్తుంచుకోండి!

>
మరిన్ని వార్తలు